Homeలేటెస్ట్ న్యూస్యువజన ఉత్సవాలను ప్రారంభించిన డాక్టర్ కడియం కావ్య

యువజన ఉత్సవాలను ప్రారంభించిన డాక్టర్ కడియం కావ్య

యువజన ఉత్సవాలను ప్రారంభించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

యువజన ఉత్సవాలు (Youthfestival) విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, నాయకత్వ గుణాలను వెలికితీయడంలో దోహదపడతాయని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. మంగళవారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఇల్లంద క్లబ్ లో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో స్థానిక శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారితో కలసి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Dr Kadiyam Kavya
Students Pledge

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. యువత వివిధ పోటీల్లో పాల్గొని జిల్లా ప్రతిభను ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. జాతీయ యువజనోత్సవం సందర్భంగా యువత తమలోని ప్రతిభను ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. యువత స్వామి వివేకానంద ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Group photo with Students

రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు యువతులు చేసిన జానపద నృత్యాలు అలరింపజేశాయి. అనంతరం మాదక ద్రవ్యాల నివారణ, అవగాహనపై ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు, జిల్లా యువజన మరియు క్రీడా అధికారి ch రఘు, ఇతర అధికారులు, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments