వినూత్న ప్రయత్నంతో కోతుల బెడదకు చెక్ పెట్టిన యువ సర్పంచ్ …
నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద నుంచి గ్రామస్తులను రక్షించేందుకు కొత్తగా ఎన్నికైన యువ సర్పంచ్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్‌గా ఎన్నికైన కుమ్మరి రంజిత్, కోతులను గ్రామం నుంచి తరిమికొట్టేందుకు స్వయంగా ఎలుగుబంటి వేషం ధరించారు.
గ్రామంలో ఎలుగుబంటి కనిపించిందని భావించిన కోతులు భయంతో అడవివైపు పరారయ్యాయి. దీంతో రైతులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సమస్యను వినూత్నంగా పరిష్కరించిన యువ సర్పంచ్ రంజిత్‌ను గ్రామస్థులు అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలకు ఇలాంటి సృజనాత్మక పరిష్కారాలు అందిస్తానని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు.
ఎలుగుబంటి వేషం వేసిన యువ సర్పంచ్..
RELATED ARTICLES