Homeవరంగల్సాయుధ పోలీసుల పనితీరు అభినందనీయం: వరంగల్ సీపీ

సాయుధ పోలీసుల పనితీరు అభినందనీయం: వరంగల్ సీపీ

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ పోలీసుల పనితీరు అత్యంత ప్రశంసనీయం అని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. బుధవారం సిటీ ఆర్మ్డ్‌ రిజర్వ్‌ (CAR) విభాగంపై వార్షిక తనిఖీ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

Police Parade

పోలీస్‌ పరేడ్‌ మైదానానికి చేరుకున్న కమిషనర్‌ను ఆర్మడ్‌ రిజర్వ్‌ అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసులు నిర్వహించిన పరేడ్‌ను పరిశీలించి, పోలీసు సిబ్బంది ఆయుధాలపై ఉన్న పరిజ్ఞానం, వాటి వినియోగ విధానం, వ్యాయామం, యోగా వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన సిబ్బందికి క్షేత్ర స్థాయిలోనే రివార్డులు ప్రకటించారు.

రుద్రమ ఉమెన్స్‌ స్పెషల్‌ ఫోర్స్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి

వరంగల్‌ కమిషనరేట్‌ ఏర్పడిన తర్వాత కమిషనర్‌ ఆదేశాలతో రుద్రమ ఉమెన్‌ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌‌ను ఏర్పాటు చేశారు. ఈ విభాగం మహిళా సిబ్బంది కమాండో శిక్షణ, ఆయుధ వ్యవహారాలు, దేహ దారుఢ్య వ్యాయామాలు పూర్తి చేశారు. తనిఖీల సందర్భంగా కమిషనర్‌ ఈ విభాగం సిబ్బంది చూపిన విన్యాసాలను — కళ్ళకు గంతలు కట్టి ఆయుధాలను విడదీయడం, మళ్లీ సమీకరించడం వంటి ప్రదర్శనలను — ప్రశంసించారు. రుద్రమ ఉమెన్‌ పోలీస్‌ ఫోర్స్‌ సిబ్బంది నైపుణ్యాన్ని మెచ్చి వారికి రివార్డులు తెలిపారు.

Woman Police

శాఖపరమైన సూచనలు

తనిఖీల అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ, అధికారులు మరియు సిబ్బంది అప్పగించిన బాధ్యతలను కర్తవ్యనిష్ఠతో నిర్వర్తించాలని సూచించారు. సిబ్బంది ఎటువంటి శాఖపరమైన సమస్యలు ఎదుర్కొంటే, వాటిని తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేష్‌కుమార్‌, శ్రీనివాస్‌, రవి, ట్రెయినీ ఐపీఎస్‌ మనిషా నేహ్రా, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, ఆర్‌.ఐలు స్పర్జన్‌రాజ్‌, సతీష్‌, శ్రీధర్‌, చంద్రశేఖర్‌, అలాగే ఇతర పోలీసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments