Homeవరంగల్వరంగల్ జిల్లాకు మరిన్ని ఈవీ బస్సులు అవసరం – ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వరంగల్ జిల్లాకు మరిన్ని ఈవీ బస్సులు అవసరం – ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

ఉమ్మడి వరంగల్ జిల్లాకు అదనంగా ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) బస్సులను కేటాయించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు.

ప్రజల్లో ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ బ్యాటరీ బ్లాస్ట్‌లపై భయాందోళనలు నెలకొన్నాయని, అలాంటి అపోహలను నివృత్తి చేస్తూ ఎలక్ట్రిక్ వాహనాలపై విస్తృత అవగాహన అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే నాగరాజు సూచించారు.

పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఈవీ వాహనాల వినియోగాన్ని విస్తరించే దిశగా కృషి చేస్తున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ జిల్లాకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments