హనుమకొండ జిల్లా:
చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పెరుగుతున్న చలి తీవ్రత వలన, వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని DMHO డా.A. అప్పయ్య సూచించారు. చలి తీవ్రత క్రమంగా పెరగడం, ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.