Homeవరంగల్వరంగల్ జిల్లా భూకొలతదారుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

వరంగల్ జిల్లా భూకొలతదారుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

వరంగల్ జిల్లా అనుమతి పొందిన భూకొలతదారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు జనవరి 4న రంగసాయిపేటలోని ఒక కార్యాలయంలో న్యాయ సలహాదారులు గోనె విజయ్ రెడ్డి, బర్ల పూర్ణచందర్ పర్యవేక్షణలో జరిగాయి. ఈ ఎన్నికల్లో కొత్త కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

నూతన కార్యవర్గం ఈ విధంగా ఉంది:

• అధ్యక్షుడు: దేవునూరి రాజు
• కార్యనిర్వాహక అధ్యక్షుడు: రంగు శివ
• ఉపాధ్యక్షుడు: జినికిరి రాజ్‌కుమార్
• ప్రధాన కార్యదర్శి: గజవెల్లి ప్రదీప్
• వరంగల్ విభాగ సమన్వయకర్త: మామిడాల సాయి రామ్
• కార్యదర్శులు: బొమ్మెర రమ, మరుపట్ల ఏకాంబరం
• కోశాధికారి: ధర్మసోత్ కిరణ్
• సలహాదారు: ఆవునూరి శివకుమార్
• మహిళా విభాగ సమన్వయకర్త: బలుగురి దీపిక
• నర్సంపేట విభాగ సమన్వయకర్త: పెంతల విష్ణు

అదనంగా, జిల్లా పరిధిలోని పదమూడు మండలాలకు పదమూడు మంది సమన్వయకర్తలు నియమితులయ్యారు.

ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షుడు దేవునూరి రాజు మాట్లాడుతూ, త్వరలో డెబ్బై గ్రామాల్లో పునః భూకొలతలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అలాగే ప్రభుత్వం తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని చెప్పారు.

సభ్యులంతా ఐకమత్యంతో ముందుకు సాగి, భూకొలతదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments