వరంగల్: వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ భూముల అప్పగింత ప్రక్రియ కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) హైదరాబాద్ జనరల్ మేనేజర్ బీపీ రావు బృందం శనివారం ఉదయం వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకుంది.
వరంగల్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ మరియు ఏర్పాటుకు అవసరమైన 223 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల నుంచి సేకరించింది.
సేకరించిన ఈ భూములను ఈరోజు రెవెన్యూ అధికారులు అధికారికంగా ఏఏఐ (AAI) బృందానికి అప్పగించనున్నారు.