వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గారు హన్మకొండ వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ నుంచి ఉనికిచెర్ల వరకు రహదారిలో తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
నగర మేయర్ గుండు సుధారాణి, GWMC కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి రోడ్డు లోపాలను స్వయంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రమాద నివారణ చర్యలు
ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, రిఫ్లెక్టర్ స్టడ్స్ ఏర్పాటు చేయాలి.
రహదారి పక్కన స్ట్రీట్ లైటింగ్ మెరుగుపరచాలి, అవసర చోట్ల రోడ్డు విస్తరణ చేపట్టాలి. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి వేగ నియంత్రణలో ప్రయాణించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ..
రోడ్డు ఇంజనీరింగ్ లోపాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, బ్లాక్ స్పాట్లను గుర్తించి శాశ్వత పరిష్కారాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. తన పోలీసు అనుభవాన్ని ఉపయోగించి మున్సిపల్, R&B, పోలీసు శాఖల అధికారులతో సమస్యలు సమీక్షించి సూచనలు చేశామని పేర్కొన్నారు.
రేపు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి శాశ్వత పరిష్కారాలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, R&B శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.