తెలంగాణలోని పలు ప్రాంతాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
యూరియా కోసం రైతులు అర్ధరాత్రి నుంచే రైతు వేదికల వద్ద క్యూ కడుతున్నారు. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా వేచి చూస్తున్నారు. మహిళా రైతులు యూరియా కోసం క్యూలైన్లలో ఘర్షణ పడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో (SM) వైరల్ అవుతున్నాయి.
క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతుంటే,యూరియా స్టాక్స్ పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. రైతులు ఇబ్బంది పడటానికి ప్రధాన కారణం డిజిటల్ యాప్‌ల ద్వారా యూరియా పొందే విధానంపై అవగాహన లేకపోవడమేనని అభిప్రాయపడుతున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రకటించారు.