Homeలేటెస్ట్ న్యూస్ఈ రోజు ముఖ్యాంశాలు: 26.11.2025

ఈ రోజు ముఖ్యాంశాలు: 26.11.2025

జనగామ జిల్లా కలెక్టరేట్‌లో వరంగల్ MP కడియం కావ్య అధ్యక్షతన దిశా సమావేశం. “పేదలకు సేవ చేయడమే లక్ష్యం” అని ప్రకటించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు.

ఈ రోజు హనుమకొండకు రానున్న కల్వకుంట్ల తారకరామారావు (KTR)

వరంగల్ కలెక్టర్ Dr సత్య శారద ఎమ్మెల్యే శ్రీ నాగరాజు గారితో కలసి పర్వతగిరి, ఐనవోలు, హాసన్పపర్తి SHGలకు వడ్డీలేని రుణ చెక్కులు, మోంథా తుఫాన్ బాధితులకు రేషన్ బియ్యం పంపిణీ.

రీటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (REWA) వరంగల్ జిల్లా కమిటీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి పెండింగ్ డ్యూస్ క్లియర్ చేయాలని డిమాండ్.

మేయర్ గుండు సుధారాణి, హన్మకొండ అంబేడ్కర్ భవన్, పిస్తా హౌస్, లాండ్రో మార్ట్ పరిశీలించారు. నాలాల్లో సిల్ట్ తొలగించాలని ఆదేశాలు.

సంగెం మండలం అశలపల్లి గ్రామంలో SC మహిళకు రిజర్వ్. ఒక్క SC మహిళా వోటర్ (మల్లమ్మ) ఉన్నందున, ఆమె సర్పంచ్.

వాన్జరపల్లి గ్రామంలో ST జనరల్‌కు రిజర్వ్, కానీ ఒక్క ST వోటర్ లేరు – వివాదం ఏర్పడింది.

తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) లో పూర్తిగా విలీనం చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న NPDCL (ఉత్తర తెలంగాణ) మరియు SPDCL (దక్షిణ తెలంగాణ) రెండు విద్యుత్ పంపిణీ సంస్థలతో పాటు, కొత్తగా మూడో డిస్కమ్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. మూడు దఫాల్లో పోలింగ్ 11 డిసెంబర్‌ – తొలి విడత, 14 డిసెంబర్‌ – రెండో విడత, 17 డిసెంబర్‌ – మూడో విడత. రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమలు.

ములుగు జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్. జగ్గన్నపేట గ్రామంలో అంతర్జాతీయ నాణ్యత కలిగిన స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు రూ. 200తో పడిపోయాయి. 22 క్యారట్ గోల్డ్ గ్రాముకు రూ. 7,450. వెండి రేటు కూడా డౌన్.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments