ఈ రోజు ముఖ్యంశాలు: వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ లో మోరాయిస్తున్న బల్దియ సైట్లు.. గత నెలరోజులుగా సైట్లు పనిచేయక ఇబ్బంది పడుతున్న ప్రజలు.
హనుమకొండ భీమదేవరపల్లి నూతన సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన మాచర్ల కుమారస్వామి.. ప్రతి నెల గౌరవ వేతనం పంచాయతీకి ఇస్తానని పేర్కొన్నారు.
గ్రేటర్ వరంగల్ 7వ డివిజన్లో సైడ్ డ్రైనేజీల నిర్మాణం, కల్వర్ట్ నిర్మాణం, పబ్లిక్ గార్డెన్లో చిన్న పిల్లలకు ఆట వసతుల కల్పనలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన బి టెక్ 3వ, 5 వ,7వ సెమిస్టర్ పరీక్షలకు వాయిదా..
బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలకి సంబంధించిన స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసిన ఆర్ధిక శాఖ.
విద్యుత్ ఉద్యోగులకు 17.6% DA ఖరారైంది.. ఉన్నతాధికారుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
మేడారం మహా జాతరకు భక్తుల సౌకర్యార్థం కొరకు 3860 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ విజయ భాను తెలిపారు.
తెలంగాణ గ్రామ పంచాయతీల్లో సందడి.. ఈరోజు 12 వేలకు పైగా గ్రామాల్లో సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు.