ప్రణయగీతం:
ఆడపిల్ల తల్లితండ్రులు ఎవరయినా కూడా..
“ఈ వ్యక్తితో మా అమ్మాయి జీవితం బాగుంటుంది, తనని మాకంటే బాగా చూసుకుంటాడు.. తనతో మా అమ్మాయి సంతోషంగా ఉంటుంది అనే నమ్మకం ఉంటే, ఎవరైనా కూడా పెళ్ళికి ఒప్పుకుంటారు కానీ కులామతాలను, వారి వెనుక ఉన్న పలుకుబడిని చూసి ఇవ్వరు..
ఆహ్ నమ్మకం మా వాళ్ళకి మీరు కల్పించాలి. అప్పుడే మన ప్రేమ గెలుస్తుంది”.
కాజిపేట్…
శ్రీనివాస నిలయం :-
గీత :- అమ్మ అన్ని సర్ధావా? ట్రైన్ కి టైం అవుతుంది.
సునీత :- జాబ్ చేసే వయసు వచ్చింది అయినా కూడా నీకు అన్ని నేనే చేసిపెట్టాలా..
శ్రీనివాస్ :- సునీ …నా బంగారు తల్లినీ ఎం అంటున్నావ్..!!
సునీత :- ఇంత వయసు వచ్చాక పనులన్ని నా తోనే చేయించుకుంటావా అని చెప్తున్నా..
శ్రీనివాస్ :- పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా మన కంటికి చిన్న పిల్లలే కదా.. మరి మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు..
గీత:-
Love u Dady
అని చెప్పి, శ్రీనివాస్ దగ్గరికి వెళ్లి hi-fi ఇస్తుంది.
సునీత :- ????
గీత :- ఏంటి మమ్మీ మా డాడీ ని చూసి కుళ్ళుకుంటున్నావా.. మా డాడీ లా మీ డాడీ లేరని
సునీత :- ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్.. మా డాడీ నన్ను మీ డాడీ కి ఇచ్చి పెళ్లి చేసారు కాబట్టే నీకు మీ డాడీ దొరికాడు.
గీత :- సరేలే.. నువు చెప్పినవన్నీ వింటూ కూర్చుంటే నాకు ట్రైన్ మిస్ అవుతుంది
బాయ్ మమ్మీ, డాడీ..
శ్రీనివాస్ :- ఒక్కదానివే ఎలా వెళ్తావ్ కన్నా..
గీత :- డాడీ.. శృతి వస్తుంది నాతో
సునీత :- హ్మ్మ్..
తనది వరంగల్, నీది కాజిపేట్ .. ఎలా వెళ్తారే మీరు కలిసి??
గీత :- మమ్మీ మరి టూ మచ్ చేయకు, మేము ట్రైన్ లో కలుస్తాం ఓకే నా.. బాయ్ ఇద్దరికి..
సునీత, శ్రీనివాస్ :- బాయ్ కన్నా.. టేక్ కేర్..
( గీత, శృతి స్కూల్‌మేట్స్.. ఇద్దరు ఒకటే హాస్టల్ )
హైదరాబాద్…
శృతి :- ఒసేయ్..నాకు భయంగా ఉందే..
గీత :- భయమా.. దేనికి??
శృతి :- మనం ఇప్పుడు ఇంటర్వ్యూ కి వెళ్తున్నాం కదా, అందుకే?
గీత :- భయపడుతూ ఉంటే మనకు జాబ్ వస్తుందా చెప్పు, ఇంత దూరం వచ్చి, జాబ్ రాలేదని రిటర్న్ అవుతే ఎలా ఉంటుంది.. ఇంటర్వ్యూ లో ఏ క్యూస్షన్స్ అడిగిన, భయపడకుండా, కాన్ఫిడెంట్ గా నీకు తెలిసింది చెప్పు ఓకే నా.
శృతి :-ఓకే
ఇన్ఫోసిస్..
శృతి :- గీత.. నాకు జాబ్ వచ్చిందే..
గీత :- కంగ్రాట్స్ ఎ.. నాకు కూడా జాబ్ వచ్చింది
శృతి :- కంగ్రాట్స్ నీకూడా.. ఇంతకీ నువ్వు ఎవరి టీమ్
గీత :- ఎవరో ప్రణయ్ అంట.. తన టీమ్, నువ్వు??
శృతి :- yahoo… నాకింకా ఎం భయం లేదు.. ఇద్దరం ఒకటే టీమ్
గీత :- ఏంటి.. నువ్వు కూడా అదే టీమ్ ఆహ్??
శృతి :- అవునే.. సరే, పద.. ఇప్పుడు ఆహ్ ప్రణయ్ వచ్చాడో లేదో చూదాం..
గీత :- ఈస్క్యూజ్ మీ..
కార్తీక్ :- చెప్పండి
గీత :- ప్రణయ్ అంటే మీరేనా?
కార్తీక్ :- తనతో మీకేం పని?
శృతి :- అయితే నువ్వు ప్రణయ్ కాదు…
రావే గీత, వీడికి మనమేందుకు చెప్పాలి
కార్తీక్ :-.. Hey.. Hold ur tongue..
గీత :- సారీ సార్.. తనేదో తెలియక అంది
శృతి :- హే గీత.. వీడికి రెస్పెక్ట్ ఎందుకే
కార్తీక్ :- తానేమైనా చిన్నపిల్లనా, తెలియక పోవడానికి.. పెళ్లి అయితే ఈ పాటికి అమ్మమ్మ అయ్యేది
శృతి :-కోపం తో…
గీత :- నువ్వు రావే..అని శృతి ని తీసుకెళ్తుంది.
కార్తీక్ :-నన్నే వీడు అంటావా… నువ్వు ఎలాగైనా మా టీమ్ ఎ కదా, అప్పుడు చెప్తా ని సంగతి.. అని మనుసులో అనుకుంటాడు..
ప్రణయ్ ఒప్పొసిట్ సైడ్ తిరిగి నిల్చుంటాడు.
గీత :- ఈస్క్యూజ్ మీ… ప్రణయ్ అంటే మీరేనా??
ప్రణయ్ :- హ.. అవును అని ముందుకి తిరుగుతాడు..గీత కి ఒప్పొసిట్ గా..
వెంటనే ఇద్దరి కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి..
శృతి :- సడన్ గా ఎం అయింది దీనికి, అంకుల్ గుర్తుకు వచ్చాడా అని అనుకోని, పక్కకి లాగుతుంది గీతని..
వెంటనే ఇద్దరి కళ్ళలో నుండి నీళ్లు రావడం ఆగుతాయి..
శృతి :- మేము న్యూ గా జాయిన్ అయ్యాం..
ప్రణయ్ :- ఒహ్హ్…… హాయ్
అప్పుడు కార్తీక్ వీళ్ళ దగ్గరికి వస్తాడు
కార్తీక్ :- ప్రణయ్.. మనకు సార్ న్యూ ప్రాజెక్ట్ ఇచ్చాడు రా, టైమ్ కూడ తక్కువ ఇచ్చాడు
ప్రణయ్ :- అవునా … ఇబంది ఏం లేదు వీళ్ళు మన న్యూ టీమ్ మెంబెర్స్..అనుకున్న సమయం లోనే వర్క్ కంప్లీట్ అవుతుంది.
కార్తీక్ :- ఓహ్.. న్యూ టీమ్ మెంబెర్స్ ఆహ్.. ఇంకేంటి మరి వర్క్ వీళ్ళతోనే చేయించచ్చు
శృతి:- మనసులో.. ఆమ్మో వీడు నేను ఒకటే టీమ్ ఆహ్.. రివెంజ్ తీసుకుంటాడు కావచ్చు అని అనుకుంటుంది.
శృతి ఎక్స్ప్రెషన్ చూసి, కార్తీక్ నవ్వుకుంటాడు..
ఇక్కడ.. ప్రణయ్, గీత అంత సడన్ గా కళ్ళలో నుంచి నీళ్లు ఎందుకు వచ్చాయో అని ఆలోచిస్తారు.
మరుసటి రోజు…
శృతి :- ఒసేయ్.. గీత, తొందరగా రావే.. లేట్ అయితే వాడు నాకు పూజ చేస్తాడు ఇక ..
గీత :- అందుకే నోరు అదుపులో పెట్టుకోమంది.. చేసుకున్న దానికి అనుభవించు
ఆఫీస్ లో
కార్తీక్ :- ఏంటి అమ్మమ్మ.. తొందరగా వచ్చావు, వర్క్ చేయాలనీ అంత తొందరగా ఉందా ఏంటి ..
శృతి :-కాదు తాతయ్య.. నీతో చేయిదామని వచ్చా
కార్తీక్ :- నేను ఎం అయినా నీ మొగుడిన.. నువు అమ్మమ్మ అయితే, నేను తాతయ్య కావడానికి
శృతి :- అయితే ముతాతయ్య…
కార్తీక్ :- హే .. టీమ్ మెంబెర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా..
శృతి :- నేను కూడా టీమ్ మెంబెర్ కదా.. నాకు రెస్పెక్ట్ ఏది
కార్తీక్ :- చి.. నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి ..
ప్రణయ్ అప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి….
కార్తీక్ గొడవ ఏంటి రా అంటాడు..
వెంటనే గీత వెనక్కి తిరిగేసరికి, ప్రణయికి ఎదురుగా ఉంటుంది.. కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్న ఒక్క క్షణం.. అలానే చూసుకుంటూ ఏదో ట్రాన్స్ లోకి వెళ్తారు.
ముందుగా ప్రణయ్ తేరుకొని, అక్కడి నుండి వెళ్ళిపోయి, ఎందుకు ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తాడు.
కార్తీక్, ప్రణయ్ దగ్గరికి వచ్చి
కార్తీక్ :- ఎరా.. నా చెల్లి గురించి ఆలోచిస్తున్నావా ..
ప్రణయ్:- చెల్లి ఏంటి రా..
కార్తీక్:- ఇందాక నిన్ను, గీత ని గమనించాను రా.. ఏంటి లవ్ ఆహ్??
ప్రణయ్:- అంత వద్దు రా.. అమ్మాయిల విషయంలో నేను నీకంటే నిదానమే రా..
కార్తీక్ :- మరి అలా ఎందుకు చూసావ్ రా
ప్రణయ్ :- అది కాదు రా.. చిన్నప్పుడు అమ్మ, నాన్న చనిపోయిన, వాళ్ళు లేరని మా చుట్టాలు అనాధ ఆశ్రమంలో చేర్పించిన.. నాకు ఎవరు లేరు, నేను అనాధ అని గుర్తుకు వచ్చిన కూడా నాకు కన్నీళ్లు రాలేదు రా, కానీ ఎందుకో ఆహ్ అమ్మాయి ఎదురు పడినప్పుడల్లా అలానే జరుగుతుంది రా.. ఎందుకో అర్ధం కావడం లేదు.
కార్తీక్ :- రేయ్ .. ఇంకోసారి అనాధ అంటే చంపేస్తాను రా..
నీకు నేను ఉన్నాను రా బావ…అసలు నేను అనుకోవాలి అనాధ అని.. మా అమ్మ, నాన్న ఎలా ఉంటారో, మా చుట్టాలు ఎవరో కూడా తెలియదు నాకు..
ప్రణయ్ :- ఒరేయ్ ..మనకు ఎవరు లేకపోతే ఏంటి, నీకు నేనున్నా,
ఇద్దరికి ఇద్దరం.. ఇంకోసారి నువ్వు ఎప్పుడు అలా అనుకోకు..
సరే కానీ.. వర్క్ స్టార్ట్ చేద్దాం పద..
కార్తీక్ :- ప్రణయ్.. కొత్తగా వచ్చింది కదా శృతి, తనకి వర్క్ ఎక్కువ చెప్పు రా, వీలైతే నా వర్క్ కూడా తనకే ఇవ్వు
ప్రణయ్ :- ఎందుకు
కార్తీక్ :- రివెంజ్ రా బావ..
రోజు కార్తీక్, శృతి ఏదో ఒక గొడవ పడడం, ప్రణయ్ వచ్చి ఆపడం జరుగుతుంది.
ఒక వారం శృతితో ఉండి మరి, లేట్ నైట్ వర్క్ చేపిస్తాడు కార్తీక్..గీత, ప్రణయ్ మాత్రం ఈవెనింగ్ వర్క్ కంప్లీట్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోతారు.. ఈ వన్ వీక్ లో ఇద్దరు ఎదురు పడినప్పుడల్లా అదే రిపీట్ అవుతుంది.
ఒకరోజు… శృతి వర్క్ చేసే దగ్గరికి కార్తీక్ వస్తాడు..
శృతి :- ??
కార్తీక్ :- సారీ రా బంగారం
శృతి :- చేసిందంతా చేసి
ఇప్పుడు సారీ చెప్తున్నావా.. నీ సారీ ఎవరికీ కావాలి..
కార్తీక్ :- అసలు ఇదంతా నీ వల్లే.. అందుకే అలా చేయాల్సి వచ్చింది… అయినా లేట్ నైట్ వర్క్ అని, నీతో ఉంటున్నాను కదా బేబీ
శృతి :- ఏంటి నా వల్లనా ??
కార్తీక్ :- మరి కాకపోతే.. నీతో టైమ్ స్పెండ్ చేయాలి అని నాకుండదా ఏంటి ..నువ్వు గీతకి మన లవ్ గురించి చెపితే ఇన్ని తిప్పలు వచ్చి ఉండేవి కాదు కదా.. తన ముంగట నిన్ను తిట్టాల్సినా అవసరం ఉండేది కాదు
శృతి :- ఏంటి తప్పంతా నాదే అంటున్నావ్.. నువు ప్రణయ్ కి చెప్పవా మరి
కార్తీక్ :- చెప్పాను..
శృతి :- ఏంటి …… మరి తన ముందట నాతో గొడవ పడ్డావు కదా రా..
కార్తీక్ :- ప్రణయ్ కి నాకు లవర్ ఉందని తెలుసు కానీ అది నువ్వు అని తెలియదు..
శృతి :- నిన్ను ఎలా నమ్మాలి ??
కార్తీక్ :- నేను నీతో గీత ముందటనే గొడవ పడ్డాను కానీ, ప్రణయ్ ముందట ఎప్పుడైనా గొడవ పడ్డనా?? వాడికి నువ్వు అని తెలిస్తే ఎం లేదు ఇక.. నా చెల్లి అని నీకే సపోర్ట్ చేస్తాడు
శృతి :- అవునా ..!
కార్తీక్ :- అవును.. కానీ నువ్వు ఎందుకు గీత కి చెప్పలేదు
శృతి :- తనకి ప్రేమ మీద నమ్మకం లేదు రా, నేను చెప్తే ఎక్కడ నన్ను లవ్ చేయకూడదు అని చెప్తుందో అని భయం..
కార్తీక్ :- మరి చెప్పకుండా ఎన్ని రోజులు ఇలా
శృతి :- ఏమో రా..
కార్తీక్ :- సరే అయితే.. రేపు సండే కదా, అందరం ఎక్కడికైనా వెళ్దాం, అప్పుడు గీత తో చెపుదాం ఓకే నా
శృతి :- ఓకే..
సండే..
ఇక్కడ శృతి గీత ని, అడుగుతుంది.
శృతి :- గీత ఇవాళ సండే కదా, మన టీమ్ అంత ఏదో ట్రిప్ ప్లాన్ చేశారు.. వెళదామా
గీత :- నేను కూడా అదే టీమ్ కదా, మరి నాకు ఎందుకు తెలియదు
శృతి :- నేను లేట్ నైట్ వర్క్ చేశా కదా అందుకే..కార్తీక్ నాతోనే ఉన్నాడు గా, చెప్పాడు.. అయినా ఇన్ని క్యూస్షన్స్ ఏంటే.. వస్తావా రావా
గీత మనుసులో.. ఆమ్మో.. ఎదురు పడినప్పుడల్లా కన్నీళ్లు వస్తున్నాయ్.. ఇంకా రోజు మొత్తం కలిసి ఉండడం అంటే.. కన్నీళ్లు అసలు ఆగవేమో…కావచ్చు..
ప్రణయ్ ది కూడా అదే ఫీలింగ్.. అని అనుకుంటుంది.
శృతి :- అబ్బా ఎం ఆలోచిస్తున్నావే..
గీత :- శృతి.. నేను నీకు ఒకటి చెప్పాలి
శృతి :- ఏంటే
గీత :- ప్రణయ్ నేను ఎదురు పడినప్పుడల్లా నాకు కన్నీళ్లు వస్తున్నాయే.. ఎందుకో అర్ధం కావడం లేదు..అందుకే నేను ఇవాళ రాను, కాకపోతే మనిద్దరం వెళ్దాం ఎక్కడికైనా
శృతి :-అవునా.. ప్రణయ్ కి కూడా అలానే జరుగుతుందా మరి ??
గీత :- ఏమో నే.. నేను అంతలా గమనించలేదు.
శృతి :- సరే..
కార్తీక్ కి కాల్ చేసి చెప్తుంది
కార్తీక్ :- ఏంటి గీత కి కూడా అలానే జరుగుతుందా
శృతి :- గీత కి కూడా అంటే.. ప్రణయ్ కి కూడా నా??
కార్తీక్ :- హ అవును.. ఒకసారి నాతో వాడు చెప్పినట్టు గుర్తు
ఏమి చేద్దాం మరి ??
శృతి :- కార్తీక్.. మా వరంగల్ లో వెయ్యి స్థంబాల గుడిలో ఒక స్వామీజీ ఉంటాడు రా.. తన దగ్గరికి వెళ్దాం.. వీళ్ళ సమస్యకి పరిష్కారం తప్పకుండ దొరుకూతుంది.
కార్తీక్ :- హ్మ్మ్.. సరే అయితే నువు గీత కి చెప్పి, స్టేషన్ కి తీసుకురా, నేను ప్రణయ్ ని తీసుకువస్తాను.
శృతి :- ఓకే రా..
కార్తీక్ ప్రణయ్ కి, శృతి గీత కి చెప్తుంది..
అందరు స్టేషన్లో కలుసుకొని వరంగల్ వెయ్యి స్థంబాల గుడి కి వెళ్తారు..
శృతి, కార్తీక్ స్వామీజీ కోసం వెళ్తారు. ప్రణయ్, గీత మాత్రమే అక్కడ ఉంటారు.. వీళ్ళకి కన్నీళ్లు రావడం స్టార్ అవుతుంది.. ముందుగా ప్రణయ్ కర్చీప్ తీసుకోని గీత కి ఇస్తాడు, కన్నీళ్లు తుడుచుకోమని… కర్చీఫ్ ఇచ్చేటప్పుడు ప్రణయ్ చేతి మీద ఉన్న బాణం గుర్తుని గీత, గీత చేతి మీద ఉన్న విల్లు గుర్తు ని ప్రణయ్ చూస్తాడు.. వారికీ ఏవో గుర్తుకు వచ్చి, ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోతారు..
అక్కడ ఉన్న స్వామిజి శిష్యుల్లో ఒకరు, స్వామీజీ దగ్గరికి వచ్చి.. స్వామి అక్కడ ఎవరో దంపతులు కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్తాడు.. స్వామీజీ దగ్గర ఉన్నా శ్రుతి, కార్తీక్ తనతో పాటే ప్రణయ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు..
స్వామీజీ :- శిష్య… వీరు దంపతులు కాదు.. వీళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. వీళ్ళకి ఈ మధ్యనే పరిచయం అయింది.. వీళ్ళు ఇక్కడికి ఒక పరిష్కారం కోసం వచ్చారు.
శృతి, కార్తీక్ :-..స్వామి మీరు చెప్పింది కరెక్ట్
స్వామీజీ :- .. వారిని లోపలికి తీసుకురండి..
ప్రణయ్, గీత.. పక్కపక్కన కూర్చుంటారు..
ప్రణయ్ :- స్వామి.. నాకు ఈ అమ్మాయి ఈ మధ్యనే పరిచయం అయింది, కానీ తాను ఎదురుగా ఉన్నపుడల్లా నాకు కన్నీళ్లు వస్తున్నాయి.. ఎందుకు స్వామి??
గీత :- నా సమస్య కూడా అదే స్వామి..
స్వామీజీ :- ఎందుకంటే మీరు గత జన్మలో ప్రేమికులు కాబట్టే..
గీత :- ప్రేమికులమా??.. కానీ స్వామి నాకసలు…..
స్వామిజి :- నీకసలు ప్రేమ మీద నమ్మకం లేదు.. కానీ అది ఈ జన్మలో తల్లి..
గత జన్మలో మీ ప్రేమ విఫలం అయింది.. అందుకే ఈ జన్మలో నీకు ప్రేమ మీద నమ్మకం లేదు..
ప్రణయ్, గీత, శృతి, కార్తీక్ :- గత జన్మ ఏంటి స్వామి??
గతం:-
గతంలో మీరు రాజవంశీయులు మరియు బావమరదలు.. మీకు ఊహ తెలియకముందే మీ మధ్య ప్రేమ చిగురించింది… మీ వయసుతో పాటే అది కూడా పెరిగింది. మీరంతా కలిసి ఉండేవారు.. ఒకరోజు మీరు బయటికి వెళ్లారు, అక్కడే మీరు మీ చేతి పై ఉన్న గుర్తులని పచ్చ బొట్టు వేయించుకున్నారు. అందుకే అది చూడగానే మీరు కళ్ళు తిరిగి పడిపోయారు..
పచ్చబొట్టు వేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి మీ అమ్మ వాళ్ళు ఆస్తి విషయంలో గొడవ పడుతున్నారు. గీత వాళ్ళ అమ్మ తెల్లారేసరికి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, నాకు ఆస్తి రాకపోయినా పర్వాలేదు కానీ మా అన్నయ్య బాగుండాలి అని అనుకుని, గీత కి చెప్తుంది.
గీత కి వాళ్ళ బావ ని వదిలి వెళ్లడం ఇష్టం లేదు..
నైట్ టెర్రస్ మీదకి రా.. అని గీత ఒక లెటర్ రాసి పనిమనిషితో ప్రణయ్ కి పంపుతుంది.. కానీ ఆ లెటర్ ప్రణయ్ వాళ్ళ అమ్మ చదివి చింపేస్తుంది. మరుసటి రోజు గీత వాళ్ళు ఊరు వదిలి వెళ్లిపోయారు.. ప్రణయ్.. గీత నాకు చెప్పకుండా వెళ్ళింది అని తనపై కోపంగా ఉంటాడు. గీత… లెటర్ పంపిన కూడా నన్ను కలవడానికి రాలేదు అని ప్రణయ్ పై కోపం గా ఉంటుంది..
కొన్ని సంవత్సరాల తరువాత మీకు సంబంధాలు చూసి, వేరే వాళ్ళతో పెళ్లి నిర్ణయించారు. ఒకరిని ఒకరు మర్చిపోలేక వేరుకరితో జీవితం పంచుకోవడం ఇష్టం లేక మీరు ఆత్మహత్య చేసుకొని, మీ ప్రేమ కి ఓటమిని ఇచ్చారు..
గత జన్మలో మీ ప్రేమ విఫలం కావడానికి ఒక రకంగా ప్రణయ్ వాళ్ళ అమ్మ కారణం కాబట్టి ఈ జన్మలో మళ్ళీ అలా జరగకూడదని తనకి తల్లితండ్రులు లేకుండా చేసాడు ఆహ్ భగవంతుడు..
గతంలో మీరు దూరంగా ఉండి,మీ ప్రేమ విఫలం అయినా భాద మీ గుండెల్లో నాటుకపోయింది అందుకే మీరు ఎదురు పడిన ప్రతిసారి గుండెల్లోని భాద కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంది.. అని స్వామీజీ చెప్తాడు.
అంత విన్నాక ప్రణయ్, గీత ఒకరిని ఒకరు చూసుకుంటారు.
గీత.. ప్రణయ్ ని హాగ్ చేసుకొని ఏడుస్తుంది, సారీ బావ నిన్ను తప్పుగా అర్ధం చేసుకొని నీ మీద కోపం పెంచుకున్నాను అని చెప్తుంది..
ప్రణయ్ :- నేను కూడా గీత.. I’m sorry..
గీత :- love u బావ
ప్రణయ్ :- love u too గీత
కార్తీక్, శృతి.. ఇది కరెక్ట్ టైమ్, మా ప్రేమ విషయం చెప్పడం అనుకోని…
మీతో ఒకటి చెప్పాలి అంటారు.
ప్రణయ్, గీత.. ఏంటి అన్నట్టు చూస్తారు.
కార్తీక్ :- నాకు లవర్ ఉందని నీకు తెలుసుగా, తనెవరో కాదు రా ఈ శృతి….డిగ్రీ లో నుండి స్టార్ అయింది రా మా లవ్.. కానీ తాను నాకు డిగ్రీ అయిపోయాక ప్రపోస్ చేసింది..
ప్రణయ్ :- నువు నేను ఒకే కాలేజీ కదా రా మరి..
కార్తీక్ :- హ.. కానీ తను వేరే బ్రాంచ్.. అప్పటి నుంచే లవ్ చేస్తుందంట నన్ను…
ప్రణయ్ :- మరి నువ్వు???
కార్తీక్ :- మనం ప్రేమించిన వాళ్ళ కంటే మనల్ని ప్రేమించే వారితోనే మన జీవితం బాగుoటుంది రా.. అందుకే శృతి ప్రొపోజ్ చేయగానే ఆక్సిప్టు చేశాను..
ప్రణయ్ :- మా చెల్లి ఎవరో చెప్పు రా అంటే, టైమ్ వచ్చినప్పుడు చెప్తా అన్నావ్ ఇందుకేనా..
కార్తీక్ :- అవును రా ..!
గీత :- మరి నాకు ఎందుకు చెప్పలేదు శృతి… చిన్నపటి నుంచి మనం అన్ని షేర్ చేసుకునే వాళ్ళం కదా.. మరి ఈ ఒక్క విషయం ఎందుకు??
శృతి :- అది కాదే… నీకు ప్రేమ మీద నమ్మకం లేదు కదా.. అందుకే..
గీత :- పిచ్చిదాన.. నాకు లేకపోయినంత మాత్రాన నీ ఇష్టాన్ని కాదంటానా నేను..
అయినా దానికి కారణం ఏంటో కూడా స్వామీజీ చెప్పారు కదా.. ఇప్పుడు మా ప్రేమ అసలు విఫలం కాదు.. మా అమ్మ, నాన్న తో ప్రణయ్ గురించి చెప్పి, మా ప్రేమను గెలిపించుకుంటాను.
శృతి :- ఎలాగో వచ్చాము కాబట్టి నేను కూడా కార్తీక్ గురించి మా ఇంట్లో చెప్తాను.
ప్రణయ్, కార్తీక్ :- ఒకవేళ మీ ఇంట్లో ఒప్పుకోకపోతే??
గీత, శృతి :- ఎందుకు ఒప్పుకోరు..??
ప్రణయ్, కార్తీక్ :- ఎందుకంటే మేము అనాధ కాబట్టి.. మా కులం ఏంటో, మతం ఏంటో తెలియదు కాబట్టి
శృతి :- కులం వల్ల ప్రేమ పుట్టదు, కులం ఎం ప్రేమ కి పునాది కాదు.. మతం వల్ల సంతోషంగా ఉండరు, ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్నప్పుడు సంతోషంగా ఉంటారు.
గీత :- అవును.. శృతి చెప్పింది కరెక్ట్..
ఆడపిల్ల తల్లితండ్రులు ఎవరయినా కూడా..
ఈ వ్యక్తితో మా అమ్మాయి జీవితం బాగుంటుంది, తనని మాకంటే బాగా చూసుకుంటాడు.. తనతో మా అమ్మాయి సంతోషంగా ఉంటుంది అనే నమ్మకం ఉంటే, ఎవరైనా కూడా పెళ్ళికి ఒప్పుకుంటారు కానీ కులామతాలను, వారి వెనుక ఉన్న పలుకుబడిని చూసి ఇవ్వరు..
ఆహ్ నమ్మకం మా వాళ్ళకి మీరు కల్పించాలి. అప్పుడే మన ప్రేమ గెలుస్తుంది.
అయినా ప్రణయ్.. నువ్వు ఎప్పుడు కూడా అనాధ అని అనుకోకు, ఈ క్షణం నుంచి మా అమ్మానాన్నలు నీకూడా అమ్మానాన్నలే..
కార్తీక్ అన్నయ్య మీరు కూడా అలా అనుకోకండి.. నీకు ఇక్కడ ఒక చెల్లి ఉంది, అక్కడ అమ్మానాన్నలు ఉన్నారు.. నీ వల్ల మా వాళ్ళకి కూడా కొడుకు లేని లోటు తిరిపోతుంది..
ప్రణయ్, గీత కలిసి కాజిపేట్ కి, కార్తీక్, శృతి కలిసి వరంగల్ కి వెళ్తారు..
శ్రీనివాస నిలయం :-
గీత :- డాడీ.. తను ప్రణయ్, మేము ఇద్దరం ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నాం.. మీరు ఒప్పుకుంటే మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.
శ్రీనివాస్ :- జాబ్ చేయమని పంపిస్తే, లవ్ చేస్తున్నావా అని చేయి ఎత్తి… గీత ని దగ్గరికి తీసుకుంటాడు.. నీ ఇష్టాన్ని మేము కాదంటామ రా.. నీ సంతోషమే మాకు కావాలి.. అని అంటాడు.
గీత :- థాంక్స్ డాడీ
సునీత :- ఎం చేస్తావ్ నాన్న నువ్వు?
ప్రణయ్ :- అంటీ.. నేను, గీత ఒకటే ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నాము.
సునీత :- మీ అమ్మ, నాన్న ఎక్కడ ఉంటారు.
ప్రణయ్ :- అంటీ.. నాకు ఎవరు లేరు.. నేను అనాధ ..
సునీత :- … ఇంతకుముందు నీకు ఎవరు లేరు కావచ్చు, కానీ నీకు ఇప్పుడు మేము ఉన్నాం ప్రణయ్… మేము గీత కే కాదు నీకూడా అమ్మానాన్నలమే… ఇంకోసారి నువ్వు ఎప్పుడు భాదపడదు..
శ్రీనివాస్ :- అలాగే ప్రణయ్.. గీత నిన్ను ఎం అయినా అంటే మాకు చెప్పు, దాన్ని సంగతి నేను చూసుకుంటా
ప్రణయ్ :-
గీత అలిగి పోయి పక్కకు వెళ్తుంది. శ్రీనివాస్ బ్రతిమాలిన కూడా అలక పోదు గీత కి…
సునీత :- ఏవండీ, ప్రణయ్ అన్నం వడ్డీస్తున్న రండి తిందాం
ప్రణయ్ :- అయ్యో ఆంటీ.. మరి గీత
సునీత :- అదే వస్తుంది.. నువ్వు చూడు…
అని అన్నం వడ్డీస్తుంది.
సునీ కావాలనే…. ఏవండీ వంకాయ ఇంకొంచెం వెయ్యమంటారా అని అడుగుతుంది.
గీత వెంటనే…. మమ్మీ నీకు ఎన్ని సార్లు చెప్పాలి, డాడీకి ఇష్టం అయినవి వండమని.. డాడీ వంకాయ తినడని తెలుసు కదా.. అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, డాడీ మనం swiggy లో ఆర్డర్ చేసుకుందాం అని అంటుంది..
శ్రీనివాస్ :- హ సరే బేటా.. పద..
సునీ… నువ్వు నీ ప్రణయ్ కలిసి వంకాయ తినండి.. నా బంగారం నాకు చికెన్ బిర్యానీ తెప్పిస్తుంది. అని అంటాడు.
నాకు నా గీత ఉంది అని అంటాడు..
ప్రణయ్.. అక్కడ జరిగేది అంత కొంచెం సంతోషంగా, కొంచం భాదతో చూస్తాడు.
సునీ గమనించి…
సునీత :- ప్రణయ్ నువ్వు బాధపడితే ఈ అమ్మ మీద ఒట్టు…. నీకు నేనున్నా..
ప్రణయ్ :-
గీత :- అమ్మ.. నువ్వు ప్రణయ్ కి , నాకే కాదు, ఇంకొకరికి కూడా అమ్మ వే..
సునీత :- ఎవరికి ..?
గీత :- మా అన్నయ్య కి
శ్రీనివాస్ :- మాకు నువ్వు ఒక్కదానివే కదా గీత, మరి అన్నయ్య ఎవరు
బయట నుంచి..
కార్తీక్ :- నేనే నాన్న
గీత :- అమ్మ.. కార్తీక్ నా అన్నయ్య, అంతేకాదు తను ప్రణయ్ ఫ్రెండ్, శృతి కి కాబోయ్ భర్త.. తనకి కూడా ఎవరు లేరు
శ్రీనివాస్ :- ఎవరు లేరు అంటావ్ ఏంటి గీత… ఇక్కడ అమ్మానాన్న, చెల్లి అక్కడ బావ ఉన్నారు.. ఎవరు లేరు అంటావ్ ఏంటి..
సునీ :- అవును గీత… కొడుకులు లేని మాకు దేవుడు ఒకసారే ఇద్దరు కొడుకులని ఇచ్చాడు.
శృతి :- ఏంటి గీత.. నీకు మీ అన్నయ్యనే కావాలా..నేను వద్దా..
ప్రణయ్ :- ఎందుకు వద్దు.. నువు నా చెల్లి.. అంటే గీత కి ఆడపడుచు కదా…ఆడపడుచు ని పట్టించుకోకపోతే ఎలా..
గీత :- అవును కదా, అసలే ఆడపడుచు అర్ధమొగుడు అంటారు.
అందరు నవ్వుతారు
అలా సుఖసంతోషాలతో రెండు జంటల పెళ్లి జరుగుతుంది.. రెండు జంటలు కూడా వారి ప్రేమకి గెలుపుని బహుమతిగా ఇచ్చారు..