తెలంగాణ SC స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ 2026: తెలంగాణ షెడ్యూల్డ్ కులాల ఆధ్యాయన కేంద్రం ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.
ఉమ్మడి వరంగల్ జిల్లా యువతకు బంగారు అవకాశం!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిగ్రీ పూర్తి చేసిన SC, ST, BC, మైనారిటీ మరియు దివ్యాంగ నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అధ్యయన కేంద్రం (TS SC Study Circle) ద్వారా ఉచిత శిక్షణ అందుబాటులో ఉంది.
ఈ 5 నెలల ఫౌండేషన్ కోర్సు ద్వారా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు (TSPSC గ్రూప్స్), RRB, బ్యాంకింగ్, SSC వంటి కేంద్ర పోటీ పరీక్షలకు సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు.
ముఖ్య వివరాలు:
దరఖాస్తు తేదీలు: జనవరి 9, 2026 నుంచి జనవరి 30, 2026 వరకు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే – http://tsstudycircle.co.in/ లేదా సంబంధిత పోర్టల్ ద్వారా
అర్హత: డిగ్రీ పూర్తి చేసినవారు | వార్షిక ఆదాయం ₹3 లక్షలు లోపు
గతంలో ప్రభుత్వ సంక్షేమ శాఖ ద్వారా ఇలాంటి శిక్షణ పొందని వారు మాత్రమే
ప్రవేశ పరీక్ష: ఫిబ్రవరి 8, 2026 (ఆదివారం) – ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు హన్మకొండలో నిర్వహణ
శిక్షణ కాలం: ఫిబ్రవరి 20, 2026 నుంచి జులై 19, 2026 వరకు – RTC కాలనీ, వడ్డేపల్లి, హన్మకొండలోని స్టడీ సర్కిల్‌లో
సౌకర్యాలు: ఉచిత భోజనం, వసతి | అనుభవజ్ఞులైన అధ్యాపకుల శిక్షణ
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ హన్మకొండ జిల్లా అధికారి బి. నిర్మల గారు, ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ సంచాలకులు డా. కె. జగన్ మోహన్ గారు ఆహ్వానించారు.
పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ కోసం వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: http://tsstudycircle.co.in/
ఈ ఉచిత శిక్షణ ద్వారా మీ భవిష్యత్తును మలచుకోండి – ఇది మీకు ఉద్యోగ అవకాశాలను తెరిచే బంగారు మెట్టు! 🚀