తెలంగాణ: మూడవ శాసనసభ ఏడవ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
సమావేశాల్లో శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి మంత్రులు, విప్ లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి, శాసనసభల కార్యదర్శులు స్వాగతం పలికారు.
సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడి స్థానం వద్దకెళ్లి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని మర్యాద పూర్వకంగా పలకరించారు.
శాసనసభ తొలిరోజు దివంగత సభ్యులు సూర్యాపేట మాజీ శాసనసభ్యుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు, చేవెళ్ల మాజీ శాసనసభ్యుడు కొండా లక్ష్మారెడ్డి గార్లకు శాసనసభ సంతాపం తెలియజేసింది.
అనంతరం సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు జీరో అవర్‌ను చేపట్టారు. తరువాత సభను జనవరి 2 వ తేదీకి వాయిదా వేశారు.