తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొదలపెట్టే ముందు రేవంత్ రెడ్డి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లో ఆమె విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు.
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ మరియు సీతక్క పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.