Homeఆంధ్రప్రదేశ్సంక్రాంతి స్పెషల్ రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే భారీ ఏర్పాట్లు

సంక్రాంతి స్పెషల్ రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే భారీ ఏర్పాట్లు

సంక్రాంతి స్పెషల్: పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ స్పెషల్‌ ట్రైన్స్‌ ద్వారా కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, సికింద్రాబాద్, వికారాబాద్, లింగంపల్లి, హైదరాబాద్–అజ్మీర్‌ మార్గాల్లో అదనపు సౌకర్యం కల్పిస్తోంది.

అడ్వాన్స్‌ బుకింగ్‌ వివరాలు

ఈ సంక్రాంతి ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ను ఈ నెల 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్‌, రైల్వే స్టేషన్లలోని బుకింగ్‌ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

కాకినాడ టౌన్‌ – వికారాబాద్, సికింద్రాబాద్‌, లింగంపల్లి స్పెషల్‌ రైళ్లు

జనవరి 8న కాకినాడ టౌన్‌ – వికారాబాద్‌ ప్రత్యేక రైలు నడుస్తుంది.

జనవరి 10న కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌ స్పెషల్‌ ట్రైన్‌ ఏర్పాటైంది.

జనవరి 17, 18 తేదీల్లో కాకినాడ టౌన్‌ – లింగంపల్లి/వికారాబాద్‌ ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.

జనవరి 9, 11, 12, 13 తేదీల్లో సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైళ్లు రానున్నాయి.

ఈ రైళ్లు ముఖ్యమైన స్టేషన్లలో ఆగేలా షెడ్యూల్‌ సిద్ధం చేసినట్లు రైల్వే సమాచారం.

తిరుపతి – వికారాబాద్, నర్సాపూర్ – వికారాబాద్/లింగంపల్లి స్పెషల్‌ ట్రైన్స్

జనవరి 9న తిరుపతి – వికారాబాద్‌ ప్రత్యేక రైలు నడుస్తుంది.

జనవరి 9, 11 తేదీల్లో వికారాబాద్‌ – నర్సాపూర్‌ స్పెషల్‌ రైళ్లు ఉంటాయి.

జనవరి 17, 18, 19 తేదీల్లో నర్సాపూర్‌ – లింగంపల్లి/వికారాబాద్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ నడపనున్నారు.

జనవరి 18, 19, 20 తేదీల్లో వికారాబాద్‌/లింగంపల్లి – నర్సాపూర్‌ ప్రత్యేక రైళ్లు కొనసాగనున్నాయి.

గోదావరి జిల్లాలు, తీర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చే వారికి ఈ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.

హైదరాబాద్‌ – అజ్మీర్‌ సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి సీజన్‌లో ఉత్తర భారతదేశానికి ప్రయాణించే భక్తుల కోసం హైదరాబాద్‌ – అజ్మీర్‌ మధ్య కూడా ప్రత్యేక రైళ్లను షెడ్యూల్‌ చేశారు.

ఈ నెల 23న హైదరాబాద్‌ – అజ్మీర్‌ ప్రత్యేక రైలు నడుస్తుంది.

ఈ నెల 27న అజ్మీర్‌ – హైదరాబాద్‌ స్పెషల్‌ ట్రైన్‌ తిరుగు ప్రయాణం నిర్వహిస్తుంది.

ఈ రైళ్లు మార్గమధ్యంలోని ప్రధాన స్టేషన్లలో ఆగేలా ఏర్పాటు చేశారు.

దర్గా సందర్శనకు, రాజస్థాన్‌ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్‌ చేసుకోవాలని రైల్వే విజ్ఞప్తి చేస్తోంది.

ట్రైన్స్ బుక్ చేసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments