హన్మకొండ జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎలుకతుర్తి మండలం ఇంద్రనగర్ మోడల్ స్కూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఒక కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం తీవ్రతకు యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడిని భీమదేవరపల్లి మండలం కొప్పుర్ గ్రామానికి చెందిన కొమ్ముల అంజిగా గుర్తించారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.