సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
ధర్మసాగర్ మండలం కరుణపురం లోని క్రీస్తు జ్యోతి ప్రార్ధన మందిరంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు సతీ సమేతంగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సంఘాల పాల్సన్ రాజ్ గారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రభువు ఆశీర్వాదలు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి మానవీయ విలువలకు ప్రతీక అని తెలిపారు.
ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆదర్శప్రాయమని, వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.
పరస్పర సహకారం, సహనం, సోదరభావంతో జీవించడమే క్రిస్మస్ పండుగ సందేశమని తెలిపారు.
ఈ పండుగను క్రైస్తవులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.