Homeవరంగల్సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి

సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి

పదవీ విరమణ అనంతరం సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.

పదవీ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగంలో సుధీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారుల మంగళవారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ సుధీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖ కు సేవాలందించిన పదవీవిరమణ చేస్తున్న అధికారులు నేటి తరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తారని పదవీ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలని పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం నుండి అందే డబ్బు ను భవిష్యత్తు అవసరాలకు భద్రపర్చుకోవాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీ, సురేంద్ర, ఆర్.ఐ సతీష్, స్పర్జన్ తో పాటు, ఇతర పోలీస్ సిబ్బంది, పదవీ విరమణ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments