వరంగల్ దక్షిణ భారత రాష్ట్రమైన తెలంగాణలోని ఒక ప్రధాన నగరం మరియు ఇది 12 నుండి 14 వ శతాబ్దం వరకు కాకతీయ రాజవంశం యొక్క రాజధాని.
వరంగల్ నగరం తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ నగరం మరియు ఇది సందర్శించడానికి అనేక చారిత్రాత్మక మరియు భక్తి ప్రదేశాలను కలిగి ఉంది.
వరంగల్‌కు ఇతర పేర్లు ఉన్నాయి:
హెరిటేజ్ సిటీ, గ్రేటర్ వరంగల్, ఓరుగల్లు మరియు ఎకాసిలా నాగరం.
ఖిల్లా వరంగల్ కోటలో నాలుగు అలంకార ద్వారాలు ఉన్నాయి, వీటిని కాకతీయ కళతోరణం అని పిలుస్తారు, మొదట శివాలయానికి ప్రవేశ ద్వారాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల ప్రభుత్వ అధికారులు కళతోరణం నగర నలుమూలలా ప్రవేశ ద్వారాలన్నింటికి ఉంచాలని ప్రతిపాధించారు.
అధికారికంగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ అధికారిక చిహ్నంలో పొందుపరచబడింది. ప్రస్తుత ప్రభుత్వం అందులో మార్పులు చేసారు.
గ్రేటర్ వరంగల్ చరిత్రలో కాకతీయులు మరియు కొండవీడు రెడ్డి రాజులు
వరంగల్ మరియు కాజిపేట మధ్యలో హన్మకొండ ఉంది, ఈ మూడు ప్రాంతాలను ట్రై సిటీస్ అని కూడా పిలుస్తుంటారు.
ఎందుకంటే ఈ మూడు నగరాలు బాగా అనుసంధానించబడి ఉన్నాయి మరియు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడం సులభం.
దీనికి తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాల ద్వారా రవాణా సౌకర్యం ఉంది.
వరంగల్ మరియు కాజిపేట్ రెండింటిలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఇవి వేర్వేరు నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి. కాజిపేట్ రైల్వే స్టేషన్ ఢిల్లీ, చెన్నై మరియు హైదరాబాద్ లకు రైల్వే జంక్షన్ హబ్ గా ఉంది.

వరంగల్ లో సందర్శించడానికి చాలా చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.
ఒక రోజు టూర్లో వెయ్యి స్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం, వరంగల్ ఫోర్ట్, కాకతీయ జూలాజికల్ పార్క్, మ్యూజికల్ గార్డెన్ వంటి ప్రదేశాలు చూడవచ్చు. రామప్ప టెంపుల్ (UNESCO వరల్డ్ హెరిటేజ్), పాకల్ సరస్సు, లఖ్నవరం లేక్ వంటివి 2-3 రోజుల టూర్‌కి ఐడియల్.
వరంగల్ లో సందర్శించాల్సిన ప్రదేశాలు:-
భద్రకళి ఆలయం (Bhadrakali Temple)
వరంగల్‌లోనే ఉన్న ప్రసిద్ధ శక్తి పీఠం. భద్రకాళి అమ్మవారు దర్శనం చేసుకోవచ్చు.
| ప్రదేశం | టైమింగ్స్ | ఎంట్రీ ఫీజు | ఎక్స్ట్రా డీటెయిల్స్ |
|---|---|---|---|
| భద్రకాళి ఆలయం | ఉదయం 5:30 – మధ్యాహ్నం 1:00 & సాయంత్రం 3:00 – రాత్రి 8:30 | ఉచితం | ఫెస్టివల్స్ టైమ్ లో ఎక్స్టెండ్ అవొచ్చు. ఇన్సైడ్ ఫోటోగ్రఫీ అల్లోవ్ కాదు. |
భద్రకళి కట్ట
వెయ్యి స్తంభాల ఆలయం (1000 Pillars Temple)
హన్మకొండలో ఉన్న ఈ ఆలయం కాకతీయ ఆర్కిటెక్చర్‌కు మచ్చుతునక. శివ, విష్ణు, సూర్య దేవుడికి అంకితం. రాతి ఏనుగులు, పిల్లర్స్ చూడటం అద్భుతం.
| వెయ్యి స్తంభాల ఆలయం | ఉదయం 6:00 – రాత్రి 8:00 | ఉచితం | మార్నింగ్ దర్శనం బెస్ట్.|



ఫోర్ట్ వరంగల్ (Fort Warangal)
వరంగల్ కాకతీయ రాజవంశం యొక్క పురాతన రాజధాని
| వరంగల్ ఫోర్ట్ | ఉదయం 10:00 – సాయంత్రం 7:00 | ఇండియన్స్: ₹20-25 ఫారినర్స్: ₹250-300 | కీర్తి తోరణాలు మస్ట్-సీ. లైట్ & సౌండ్ షో ఈవెనింగ్స్ లో ఉంటుంది.|


కాకతీయ జూలాజికల్ పార్క్ (Kakatiya Zoological Park)
ఈ జూ 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది, మరియు వివిధ రకాల పక్షులు, జంతువులు మరియు సరీసృపాలు ఉన్నాయి.
| కాకతీయ జూలాజికల్ పార్క్ | ఉదయం 9:30 – సాయంత్రం 5:30 | ₹50 Adults -20 (Kids).|

ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం (Regional Science Centre)
సైన్స్, టెక్నాలజీ, గణితం మరియు ఇంజనీరింగ్ బోధించడానికి ప్రభావవంతమైన పద్ధతులను ఉపయోగించే విద్యా సౌకర్యం.
| ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం | ఉదయం 9:30 – సాయంత్రం 5:30 | ₹50 Adults -25 (Kids).|

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)
గతంలో రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలగా పిలువబడే వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1959లో స్థాపించబడింది.

కాకతీయ మ్యూజికల్ గార్డెన్ (Kakatiya Musical Garden)
కాకతీయ మ్యూజికల్ గార్డెన్, తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లాలోని భద్రకాళి దేవాలయానికి సమీపంలో ఉన్న ఒక మ్యూజికల్ గార్డెన్.
| కాకతీయ మ్యూజికల్ గార్డెన్ | ఉదయం 9:00 – రాత్రి 8:00 | ₹10-20 (అప్రాక్స్) | మ్యూజికల్ ఫౌంటైన్ షో @ 7:45 PM—ఈవెనింగ్ బెస్ట్.|

కాకతీయ రాక్ గార్డెన్ (Kakatiya Rock Garden)
ఇది రాళ్ళతో అలంకరించబడిన అందమైన ప్రదేశం, ప్రకృతి ప్రేమికులకు, కుటుంబాలకు అనువైనది.

పద్మక్షి ఆలయం (Padmakshi Temple)
పద్మాక్షి అమ్మ గుట్ట (కొండ) పైన నివసిస్తుంది. ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ అన్నకొండ స్తంభం అని పిలువబడే అద్భుతమైన స్తంభం.
| పద్మక్షి ఆలయం | ఉదయం 6:00 – రాత్రి 8:00 | ఉచితం | మార్నింగ్ దర్శనం బెస్ట్.|

కాలా భైరవ ఆలయం (Kala Bhairava Temple)
కాలా భైరవ ఆలయం అంటే శివుని భయంకర రూపమైన కాల భైరవుడికి అంకితం చేయబడిన దేవాలయం
| కాలా భైరవ ఆలయం | ఉదయం 8:00 – సాయంత్రం 6:00 | ఉచితం | మార్నింగ్ దర్శనం బెస్ట్.|
గోవింద రాజుల గుట్ట (Govindarajula Gutta)
గోవిందరాజుల గుట్ట వరంగల్ జిల్లా లోని వరంగల్ రైల్వేస్టేషనుకు అతి సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం, పుణ్యక్షేత్రం.

కోటి లింగాల ఆలయం (Kotilingala Temple)
“కోటి లింగాల టెంపుల్” అనే ఆలయం ఉంది, ఇది భక్తులు తమ కోరికలు తీరాలని లింగాలను ప్రతిష్టించే ప్రదేశం

ఇస్కాన్ ఆలయం (Iscon Temple)
“ఓరుగల్లు మోక్ష ధామం” అని కూడా పిలువబడే ఈ ఆలయం శ్రీ శ్రీ రాధా నిలమాధవకు అంకితం చేయబడింది.

హరి హర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయం (Hari Hara Khestram)
వరంగల్‌లో ఉన్న ముఖ్యమైన అయ్యప్ప దేవాలయాలలో ఒకటి హరి హర క్షేత్రం

శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం (Mettu Ramalingeshwara Temple)
మడికొండలో ఉన్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం ఒక పురాతన శివాలయం, దీనిని “దక్షిణ కాశీ” అని కూడా పిలుస్తారు

శ్రీ సిద్దేశ్వర ఆలయం (Siddeshwara Temple)
ఒక పురాతన, ముఖ్యమైన శివాలయం, ఇది సిద్ధులగుట్ట దగ్గర ఉంది

యెర్రాగట్టు గుట్ట (Erragatu Gutta)
ఇది స్వయంభూ వెలసిన పురాతన ఆలయం, ఇక్కడ ఏటా వైభవంగా బ్రహ్మోత్సవాలు, జాతర జరుగుతాయి

శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ( Mallikarjun Swamy Templa, Inavol)
ఒక పురాతన శివాలయం, ఇది కాకతీయ రాజులచే 11వ శతాబ్దంలో నిర్మించబడింది, ముఖ్యంగా 108 స్తంభాలతో రథం ఆకారంలో ఉన్న అద్భుతమైన వాస్తుశిల్పం దీని ప్రత్యేకత.

బొగత జలపాతం (Bogatha Water Falls)
ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తు ఉంటుంది. రోడ్డు సౌకర్యం లేదు, కాబట్టి సందర్శకులు జలపాతం చేరుకోవడానికి కొంత దూరం నడిచి వెళ్ళాలి. వరంగల్ నుంచి 140 కి.మీ.
| బొగత జలపాతం | ఉదయం 9:00 – సాయంత్రం 5:00 | ₹30 (అప్రాక్స్) |

పాకల్ సరస్సు ( Pakhal Lake)
పాకాల్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీలో ఉన్న సీనిక్ లేక్. అడవులు, వైల్డ్‌లైఫ్ చూడొచ్చు. పీస్ఫుల్ స్పాట్. వరంగల్ నుంచి 59 కి.మీ.
| పాకల్ సరస్సు | ఉదయం 9:00 – సాయంత్రం 5:00 | Free |

లఖ్నవరం (Laknavaram Lake)
అడవుల మధ్యలో ఉన్న ఈ మన్మేడ్ లేక్‌లో సస్పెన్షన్ బ్రిడ్జ్, బోటింగ్ ఉంటాయి. పిక్నిక్, ఫోటోస్‌కు సూపర్. వరంగల్ నుంచి 80 కి.మీ.
| లఖ్నవరం | ఉదయం 9:00 – సాయంత్రం 5:00 |₹10 |

భీముని పాధం జలపాతం (Bheemmuni Padam Lake)
భీముని పాద జలపాతాలకు హైకింగ్ చేయడానికి ఉత్తమ ప్రదేశం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు జలపాతం పూర్తి వేగంతో ప్రవహిస్తుంది. వరంగల్ నుంచి 55 కి.మీ.

రామప్ప ఆలయం (Ramappa Temple)
వరంగల్ నుంచి 70 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయం UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ (2021 నుంచి). ఫ్లోటింగ్ బ్రిక్స్, ఇంట్రికేట్ స్కల్ప్చర్స్ – తప్పక చూడాలి!
| రామప్ప టెంపుల్ | ఉదయం 6:00 – సాయంత్రం 6:00 | ఉచితం | UNESCO సైట్; ఫుల్ డే ట్రిప్ ప్లాన్ చేయండి.

ఇవే కాకుండా నగరంలో మరియు నగర చుట్టుపక్కల అనేక చారిత్రాత్మిక మరియు భక్తి ప్రదేశాలు కూడా ఉన్నాయి.
రామోజీ ఫిల్మ్ సిటీ: ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా నగరం
For More Updates Follow us on
Instagram:
https://www.instagram.com/GreaterWarangalTv
Twitter:
https://x.com/GreaterWgl
Facebook:
https://www.facebook.com/GreaterWarangalNews/
YouTube:
https://www.youtube.com/c/GreaterWarangaltv
