హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన దుపెళ్లి రాకేష్ కి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం దిశగా మరింత సేవ చేసేందుకు రాకేష్ కి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పరిపాలనకు కృషి చేయాలని, యువ నాయకత్వం ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామమని డాక్టర్ కడియం కావ్య ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు.