ములుగు జిల్లా: ములుగు జిల్లాలో పెద్దపులి కలకలం
జాకారం మల్లంపల్లి మధ్య అడవిలో జాతీయ రహదారి దాటిందంటూ ప్రచారం.
పాదముద్రలను చూసి నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు.
జాకారం మల్లంపల్లి చుట్టూ గ్రామాల ప్రజలు అడవుల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక.
పులి ఆనవాళ్లు కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచన.