ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకి కొండగట్టు అంజన్నపై ఉన్న అపారమైన భక్తిని చాటుకున్నారు.
2009 ఎన్నికల ప్రచార సమయంలో హుస్నాబాద్ రోడ్ షోలో జరిగిన విద్యుత్ ప్రమాదం (కరెంట్ షాక్) నుండి తాను ఎలా ప్రాణాలతో బయటపడ్డానో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుందని.. కొండగట్టు అంజన్నే తనను కాపాడారని, అంజన్న ఆశీస్సులే తనకు పునర్జన్మ ప్రసాదించిందని పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో చెప్పారు.
సుమారు ₹35.19 కోట్ల టీటీడీ (TTD) నిధులతో నిర్మించనున్న ‘దీక్ష విరమణ మండపం’ మరియు ‘సత్రం’ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మరియు కొండగట్టులో గిరి ప్రదక్షిణ మార్గం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కొండగట్టు అభివృద్ధి విషయంలో టీటీడీ కి ఈ సందర్బంగా ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.