Homeవరంగల్జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం..

జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం..

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) పరిధిలో పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. 

గత నెలలో నిర్వహించిన BSc థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి, సుమారు 35 మంది ఇన్-సర్వీస్ అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు నిర్ధారణ అయింది. జగిత్యాల అగ్రికల్చర్ కాలేజీని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (VC) జానయ్య సందర్శించిన సమయంలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

 పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యులుగా గుర్తించిన నలుగురు అధికారులను తక్షణమే సస్పెండ్ చేశారు. అలాగే అక్రమాలకు పాల్పడిన అభ్యర్థుల అడ్మిషన్లను కూడా రద్దు చేశారు. ఈ మొత్తం ఘటనపై సమగ్ర విచారణ జరిపి, అసలు సూత్రధారులను పట్టుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments