Homeవరంగల్కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిని కలసిన ఎంపీ

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిని కలసిన ఎంపీ

వరంగల్ CGHS వెల్‌నెస్ సెంటర్‌ను త్వరగా ప్రారంభించేందుకు వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని కోరిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రోలిసింగ్ ను డిల్లీలోని వారి కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు కలిశారు. ఈ సందర్భంగా ఇటీవలే వరంగల్‌కు CGHS వెల్‌నెస్‌ సెంటర్‌ మంజూరు అయినప్పటికీ వైద్య అధికారులు మరియు పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో సేవలు నిలిచిపోయాయని వివరించారు.

CGHS వెల్‌నెస్ సెంటర్‌ను త్వరగా ప్రారంభించేందుకు వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సుమారు 12,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పదవీ విరమణ పొందిన వారు CGHS వెల్‌నెస్ సెంటర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ డా. కడియం కావ్య వివరించారు.

వృద్ధ పెన్షనర్‌లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు మరియు రోజువారీ వైద్య సహాయం వారికి అవసరం ఉందని తెలియజేశారు. ప్రస్తుతం వరంగల్‌ లో సీజీహెచ్‌ఎస్‌ కేంద్రం లేకపోవడంతో దాదాపు 350 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. త్వరితగతిన వరంగల్‌లో CGHS వెల్‌నెస్ సెంటర్ యొక్క సేవలు అందించేందుకు అవసరమైన వైద్య అధికారులు మరియు పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి రోలిసింగ్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments