నడికూడా మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి
మంగళవారం నడి కూడా మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు పరిశీలించారు.
మండల కేంద్రంలో పరకాల ఇందిరా మహిళా డైరీ కి సంబంధించి బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.
నడికూడా లో చేపడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలన్నారు.