వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, నియోజకవర్గ అభివృద్ధి, సమగ్ర సంక్షేమం కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.