ది కో ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ కల్పలత సూపర్ బజార్ ఆకస్మిక తనికి చేసిన ఎమ్మెల్యే నాయిని..
భారీ స్థాయిలో జరిగిన కుంభకోణం, అక్రమాల పై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే..
బినామీల పేర్లతో జీతాలు, సొంత వాహనాలు డీజిల్, సభ్యత్వ నమోదులో అవకతవకలు పట్ల మండిపడ్డ ఎమ్మెల్యే నాయిని..
జిల్లా అధికార యంత్రంగా వెంటనే సంబధిత పత్రాలను పరిశీలన చేసి, సీజ్ చేయాలని కోరిన ఎమ్మెల్యే..
సత్వరమే కమిటీ రద్దు చేసి, విచారణ చేపట్టాలని కలెక్టర్, RDO లకు సూచించిన ఎమ్మెల్యే..

హనుమకొండ జిల్లా ది కో ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ కల్పలత సూపర్ బజార్ కార్యాలయాన్ని మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా ఎమ్మెల్యే గారు వెళ్లిన వెంటనే కార్యాలయంలో సిబ్బంది లేకపోవడం వల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రిజిష్టర్ లో 7 గురు సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే హాజరవడం అందులో ఇద్దరు మాత్రమే విధులలో ఉండటం పై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే రికార్డులు, రిజిస్టర్, జమ, ఖర్చు తాలూకా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎమ్మెల్యే గారు తనికీలలో ప్రధానంగా దృష్టికి వచ్చిన అంశాలు :
- గతపాలకుల చేతిలో ఇంకా కీలు బొమ్మల్లా వ్యవహరిస్తూ సభ్యత్వ నమోదులో ఆర్దికపరమైన అవకతవకలు జరిగాయని తనికీలలో స్పష్టంగా కనిపించాయి.
- సభ్యత్వ నమోదుకు చెల్లించిన రుసుము మొత్తాన్ని పక్కదారిలో ఉపయోగించి వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు.
- కల్పలత సూపర్ బజార్ పాలకమండలి సభ్యులు తమ స్వప్రయోజనాలకు డీజిల్,పెట్రోల్ గడిచిన 3 ఏళ్లుగా వాడుకున్నారని వాటికి ఎటువంటి అనుమతులు లేవని,డీజిల్ డబ్బులు కూడా చెల్లాయించలేదని దృష్టికి వచ్చాయి.
- కో ఆపరేటివ్ ఆదినంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ లో 10 మంది సిబ్బంది పేరుతో నెలకు 10000/- ల చొప్పున జీతాలను తీసుకుంటున్నారు.
- జీతాలు తీసుకుంటున్న వారి వివరాలు రిజిస్టర్ లో ఉన్నప్పటికీ వారి సంతకాలు లేవు. తనికీలా అనంతరం రిజిస్టర్ లను వెంటనే జప్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ ద్వారా వివరించారు. RDO గారు కార్యాలయం చేరుకుని పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా రోజులుగా కల్పలత సూపర్ బజార్ లో అవకతవకలు జరిగాయని నా దృష్టికి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి రంగంలో అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఇక్కడ జరిగిన కుంభకోణంపై వెంటనే విచారణ చేపట్టాలని సంబధిత అధికారులకు కోరడం జరిగిందని అన్నారు.
సొసైటీలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని, తప్పు చేసిన వారిని వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు.