హన్మకొండ: బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు హనుమకొండ, కాజీపేట మండలాలకు చెందిన 84 మంది లబ్ధిదారులకు రూ.84,09,744 విలువ గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పాలన దిశ పూర్తిగా మారిందని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమతుల్యంగా అమలవుతున్నాయని స్పష్టం చేశారు.
గత పాలనలో పరిమితులకే పరిమితమైన పథకాలు, నేడు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరుతున్నాయని పేర్కొన్నారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నియోజకవర్గంలో ఎలాంటి పైరవీలు, సిఫారసులు, దళారుల వ్యవస్థకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయని స్పష్టంగా చెప్పారు. ప్రజలకు న్యాయం జరగాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ప్రతి లబ్ధిదారుడికి నేరుగా ప్రయోజనం అందేలా వ్యవస్థను శుద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.
పేదలు, మహిళలు, మైనారిటీల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ రాజకీయ అజెండా అని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.