Homeవరంగల్గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

ప్రజలకు మౌలిక సౌకర్యాలు అందించడంలో ఎటువంటి రాజీ ఉండదు.

గ్రామాలలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించేలా బాధ్యతగా పనిచేస్తూ ముందుకు వెళ్తాం.

కోటి మహిళలను కోటీశ్వరాలను చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం

MLA KR Nagaraju

మహిళా సాధికారత కోసం వారి అభ్యున్నతి కోసం నిత్యం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక కృషి.

ముల్కలగూడెం గ్రామంలో SDF నిధుల ద్వారా 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు గారు.

హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని ముల్కలగూడెం గ్రామంలో SDF నిధుల ద్వారా సుమారు 25లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు.

MLA KR Nagaraju

అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెను స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులతో ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాగరాజు.

తదనంతరం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలతో కలిసి మమేకమై పాఠశాలలో ఉన్న సమస్యలను తెలుసుకొని త్వరితిగతన వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

గ్రామంలోని మహిళా సంఘాల కోసం నా సిడిఎఫ్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు త్వరలోనే కేటాయించి భవన నిర్మాణానికి సహకరిస్తానని మహిళా సంఘాలకు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ

“గ్రామాల అభివృద్ధి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత. ముల్కలగూడెం గ్రామంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి లైన్లు, విద్యుత్ సౌకర్యాలు, కమ్యూనిటీ అవసరాల కోసం మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ఈ నిధులను వినియోగించనున్నాం. ప్రజలకు మౌలిక సౌకర్యాలు అందించడంలో ఎటువంటి రాజీ ఉండదు. ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే మా లక్ష్యం. ప్రారంభించిన ఈ పనులను త్వరితగతిన పూర్తిచేసేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తాం” అని తెలిపారు.

“ముల్కలగూడెం గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన SDF నిధులను పారదర్శకంగా, ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరే విధంగా వినియోగిస్తున్నాం. గ్రామంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించేలా బాధ్యతగా పనిచేస్తూ ఉంటాం” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments