Homeవరంగల్కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం | బీట్ కానిస్టేబుల్ చాకచక్యం

కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం | బీట్ కానిస్టేబుల్ చాకచక్యం

సోమవారం సాయంత్రం శివనగర్ ప్రాంతంలో కుటుంబ సమస్యలతో మానసిక ఆందోళనకు గురైన వ్యక్తి రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు యత్నించాడు.

ఈ సమాచారాన్ని అందుకున్న మిల్స్ కాలనీ బీట్ కానిస్టేబుల్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని సకాలంలో రక్షించారు.

అనంతరం ఆ వ్యక్తికి, అలాగే అతని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు, సురక్షితంగా వారింటికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మానవత్వంతో వ్యవహరించిన మిల్స్ కాలనీ పోలీసులు స్థానికుల ప్రశంసలు అందుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments