మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతర ముంచుకొస్తున్న సమయంలో ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతుండటంపై వారు మండిపడుతున్నారు.
జాతర జరుగుతున్న సమయంలో పనులు చేపట్టడం ఏంటని భక్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కనీసం ఆరు నెలల ముందే ఈ పనులు పూర్తి చేసి ఉంటే తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని వారు అభిప్రాయపడ్డారు.
సుదూర ప్రాంతాల నుండి అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చిన తమకు, ఈ పనుల వల్ల గర్భాలయం వరకు వెళ్లడం కష్టతరంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీ జనసందోహం మధ్య పనులు జరుగుతుండటంతో, చిన్న పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్లలో ఉండటం ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.