వరంగల్ కమిషనరేట్ పరిధి లో అవినీతికి పాల్పడిన సంఘటనలో ఇన్ స్పెక్టర్ తో పాటు ఒక కానిస్టేబుల్ సస్పెండ్.
ఇటీవల మామూనూరు పోలీస్ స్టేషన్ నుండి కంట్రోల్ రూమ్ కు బదిలీ అయిన ఇన్ స్పెక్టర్ ఓ. రమేష్ తో పాటు, మామూనూర్ కానిస్టేబుల్ జి. రఘును సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ ఉత్తర్వులు జారీ చేశారు.
సస్పెండ్ అయిన ఇరువురు మామూనూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే సమయంలో వీరిపై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో పాటు వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడం సీపీ వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.