ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో చిరుతపులి సంచారం స్థానికులను, భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. నిన్న అర్ధరాత్రి సమయంలో పాతాళగంగ సమీపంలోని ఒక ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. ఈ దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ (CCTV) కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఆలయ అధికారులు మైకుల ద్వారా ప్రకటనలు చేస్తూ భక్తులను, స్థానికులను అప్రమత్తం చేశారు. తెల్లవారుజామున పాతాళ గంగలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు.
గతంలో కూడా (2025 జనవరి 6న) ఇదే ఇంట్లోకి చిరుత రావడం గమనార్హం.