Homeహన్మకొండహనుమకొండ: ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించిన కొండా మురళి

హనుమకొండ: ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించిన కొండా మురళి

ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు హనుమకొండ రామ్ నగర్ లో తమ నివాసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు రాంనగర్ లోని నివాసానికి చేరుకుని తమ సమస్యలను కొండ మురళి గారికి విన్నవించారు.

వారి సాధకబాధకాలను కొండా మురళి గారు సహృదయంతో విని సంబంధిత పలువురు అధికారులతో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.

సులువుగా పరిష్కరించాల్సిన సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కొండా మురళి మందలించారు.

మరోసారి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలకు వెనకాడనని కొండా మురళి వారికి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ, ఏ సమస్యలున్నా ప్రజలు తనను సంప్రదించవచ్చునని ప్రజలకు స్పష్టం చేశారు.

సమస్యల పరిష్కారం దిశగా అధికారుల నుంచి సరైన సహకారం లేనిపక్షంలో తనకు తెలియజేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని కొండా మురళి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments