కాజీపేట చౌరస్తా: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట చౌరస్తాలో వడ్డే ఓబన్న గారి 219వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి హాజరై, ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వడ్డే ఓబన్న గారు కేవలం ఒక వ్యక్తి కాదు, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మహనీయుడని పేర్కొన్నారు. కష్టజీవుల హక్కులు, సమాజ సమానత్వం, న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన యోధుడని, అప్పట్లోనే అన్యాయాలకు ఎదురొడ్డి వడ్డెర కుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన నాయకుడని కొనియాడారు.
విద్య, ఉపాధి, గౌరవమే నిజమైన అభివృద్ధి అని చాటిన ఓబన్న ఆశయాలను పూలమాలతో మాత్రమే ముగించకూడదని, వాటిని పాలనలో, జీవితాల్లో అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అదే నిజమైన నివాళి అవుతుందని అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వెనుకబడిన వర్గాలు, వడ్డే సమాజం అభ్యున్నతి కోసం విద్య, ఉపాధి, నివాసం, ఆర్థిక స్వావలంబనపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వరంగల్ పశ్చిమలో వడ్డే సమాజ సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ పాటు ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వడ్డే సంఘ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.