Homeలేటెస్ట్ న్యూస్తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించడంతోపాటు మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాంపల్లిలోని సింగరేణి భవన్‌ను కల్వకుంట్ల కవితతోపాటు ఆ సంస్థ నేతలు, హెచ్ఎంఎస్ నాయకులు ప్రయత్నించారు.

వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వైపులా తోపులాట చోటు చేసుకుంది.

స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్వకుంట్ల కవితతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు.

అంతకుముందు జాగృతి అధ్యక్షురాలు కవిత ఆటోలో సింగరేణి భవన్‌కు చేరుకున్నారు.

Kavitha Arrested

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కవిత.. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత.. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. అందుకోసం జనం బాట కార్యక్రమాన్ని ఆమె ఎంచుకున్నారు.

నవంబర్ 17వ తేదీ సోమవారం.. సత్తుపల్లిలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనులను సందర్శించారు ఈ సంస్థలో డిపెండింగ్ ఉద్యోగాలనూ కాపాడుకోలేని పరిస్థితిలో ఉందన్నారు.

మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి 54 మందిని ఎంపిక చేస్తే.. ముగ్గురిని మాత్రమే తీసుకుని మిగతా 51 మందిని రద్దు చేశారని విమర్శించారు.

Kavitha in Police Car

సింగరేణి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సంస్థ కార్మికులపై మాట్లాడడం లేదని విమర్శించారు.

సింగరేణిలోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని.. వేజ్ బోర్డు ప్రకారం వేతనాలు అందజేయాలని..

ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు. సింగరేణి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల, కార్మికుల పిల్లలకు పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ సంస్థ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 19వ తేదీన జాగృతి, హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించిన విషయం విదితమే.

కవిత ప్రకటన నేపథ్యంలో బుధవారం ఉదయం సింగరేణి భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments