స్టేషన్ ఘనపూర్: (చిల్పూర్ మండలం, చిన్నపెండ్యాల)
స్టేషన్ ఘనపూర్ యువజన కాంగ్రెస్ నాయకుడు ఇల్లందుల విజయ్ ని పరామర్శించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇల్లందుల విజయ్‌కుమార్ తండ్రి నర్సింహస్వామి ఇటివల మరణించగా నేడు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య చిల్పూర్ మండలం, చిన్నపెండ్యాల గ్రామంలోని వారి నివాసానికి చేరుకుని కి”శే నర్సింహస్వామి గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇల్లందుల విజయ్‌కుమార్ ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హమీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యకులు, గ్రామా కార్యదర్శి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.