భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారి అధ్యక్షతన జరిగిన దిశా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, వివిధ శాఖల అధికారులుపాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యులు, దిశా కమిటీ ఛైర్మన్ డాక్టర్ కడియం కావ్య అన్నారు.

మంగళవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దిశా కమిటీ కమిటీ సమావేశం డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ డా.కడియం కావ్య గారు మాట్లాడుతూ, జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.
జిల్లా విద్యా హబ్ గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వైద్య సేవలపై సమీక్షించిన చైర్మన్ 45 శాతం ఆపరేషన్లు, 55 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రసూతి వైద్యులు నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
డయాబెటిస్, హైపర్ టెన్షన్, కాన్సర్ స్క్రీనింగ్ పకడ్బందీగా జరగాలని స్పష్టం చేశారు. వ్యాధులు గుర్తించిన వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.
మలేరియా సోకకుండా ముందస్తు పరీక్షలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉన్నందుకు వైద్య సేవలను అభినందించారు.
డయాలసిస్ సేవలు
డయాలసిస్ సేవలు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అందుబాటులోకి తేవాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేయాలని, జాప్యం వల్ల నిధులు వాపసు వెళ్లే అవకాశం ఉందని..
45 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు స్థల సమస్య ఉందని తెలుపగా ఎందుకు జాప్యం జరుగుతోందని ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
భూపాలపల్లి ప్రాంతం బాగా అభివృద్ధి కావాలని పథకాలు అన్ని అమలు అయ్యేలా చూస్తున్నామని పర్యవేక్షణ లోపం వల్ల జాప్యం జరుగుతోందని అన్నారు.
చిన్నారులకు ఆర్టిజం పరీక్షలు నిర్వహిచాలని, అంగన్ వాడి సిబ్బందికి అవగహన కల్పించాలని సూచించారు.

జిల్లాలో 431 పాఠశాలలున్నాయని, 14208 విద్యార్థులున్నారని తెలిపారు. పిఎం శ్రీ 8 పాఠశాలలు ఉన్నాయని, నూతనంగా ఒక పాఠశాలకు ప్రతి పాదనలు పంపినట్లు తెలిపారు.
పిఎం శ్రీ వివరాలు నోట్స్ లో పెట్టాలని తెలిపారు. 12 భవిత కేంద్రాల్లో 60 మంది విద్యార్థులు ఉన్నారని డీఈఓ చెప్పిన సమాచారం మేరకు ఎలాంటి సేవలు అందిస్తున్నారని ఎంపీ ప్రశ్నించారు.
ఎంపీ అసంతృప్తి
డీఈఓ సమగ్ర సమాచారం అందించకపోవడంతో ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సారి సమగ్ర సమాచారంతో రావాలన సూచించారు.

జిల్లాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
కెజిబివి పాఠశాలల్లో స్వీయ రక్షణ, యోగా, ఆరోగ్య పరీక్షలు, రక్త హీనత ఉన్నవాళ్లను గుర్తించి వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.
మధ్యాహ్న భోజనం మెనూ పాటిస్తున్నారా, ఆకస్మిక తనిఖీలు చేయాలని తెలిపారు.
మైనింగ్ ఇక్కడ జరుగుతుంది, సీఎస్ ఆర్ నిధులు ఇతర ప్రాంతాలకు ఇస్తున్నారు..ఎందుకు అలా జరుగుతుంది, మీకు ఎలాంటి పవర్స్ ఉండవా అంటూ మైనింగ్ అధికారిని ఎంపీ ప్రశ్నించారు.
సింగరేణి, జెన్ కో సీఎస్ఆర్ నిధులు ఇవ్వకపోతే ఎలా? ఇది సులభంగా వదిలే విషయం కాదని, పిర్యాదు చేస్తే ఎలా వుంటదో చెప్పండి అని అన్నారు. సింగరేణి అధికారులు సమావేశానికి ఎందుకు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసారు.

ఎంపీ డాక్టర్ కడియం కావ్య భూపాలపల్లిలో రైల్వే లైన్ ఏర్పాటు కు ప్రతిపాదనలు పంపామని..
బొగ్గు రవాణా వల్ల రహదారులు పాడవుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టామని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రాజబాబు, డిఆర్డీఓ బాలకృష్ణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, కెటిపిపి సీఈ శ్రీ ప్రకాష్, సింగరేణి జిఎం రాజేశ్వర రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.