తెలంగాణలో జనసేన పార్టీని విస్తృతస్థాయిలో తీసుకువెళ్లాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆదేశాలు, సూచనలతో రాష్ట్ర నాయకులు పార్టీ శ్రేణులతో విస్తృతస్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు.
ఈనెల 29వ తారీఖున హైదరాబాద్ లో తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల పార్టీ శ్రేణులు మరియు గ్రేటర్ హైదరాబాద్ పార్టీ శ్రేణులతో ముఖ్య సమావేశం ఉంటుంది.