Homeఅంతర్జాతీయంభారత బులెట్ ట్రైన్ ప్రయాణం 2027

భారత బులెట్ ట్రైన్ ప్రయాణం 2027

భారతదేశంలో తొలి బులెట్ ట్రైన్ ప్రారంభ ప్రయాణం 2027 ఆగస్టు నెలలో ప్రారంభం కానుంది. గతంలో మొదట 50 కిలోమీటర్లు అనుకున్న మార్గం ఇప్పుడు రెండింతలు పెంచి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ మరియు వాపి మధ్య 100 కిలోమీటర్లు చేస్తున్నట్టు మరియు ఈ మార్గంలోనే ట్రయిల్ రన్ చేయాలనీ నిర్ణయం తీసుకునట్టుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు.

ఇటీవల నిర్మించిన సూరత్ స్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శించి అక్కడ నిర్మాణ పురోగతిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మరియు 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు నుండి వచ్చిన పాఠాలు ఇతర రంగాలకి కూడా ఉపయోగపడాలని సూచించారు.

ఈ ప్రాజెక్టు 2017లో ప్రారంభించి, 2023 డిసెంబర్ లో పూర్తి చేయాలని భావించారు. కానీ, భూమి సేకరణ సమస్యల కారణంగా ఆలస్యమైంది. ప్రారంభ ప్రయాణానికి జపనీస్ శింకాన్సెన్ ట్రైన్ లేదా దేశీయంగా అభివృద్ధి చేసిన ట్రైన్ లలో ఏది వినియోగిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments