తెలంగాణ పోలీస్ శాఖలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో అధికారులు మూడు ప్రధాన పోలీస్ కమిషనరేట్‌లలో మార్పులు చేపట్టారు.
ఈ మార్పుల ప్రకారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లను కలిపి మొత్తం 12 జోన్‌లుగా విభజించారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు 6 జోన్‌లు, సైబరాబాద్‌లో 3 జోన్‌లు, రాచకొండలో 3 జోన్‌లు ఏర్పాటు అయ్యాయి. ఇకపై శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్‌లు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి.
దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కూడా హైదరాబాద్ పోలీస్ పరిధిలోకి చేరనుంది.
హైదరాబాద్ కమిషనరేట్‌లోని ఆరు జోన్‌లు:
• చార్మినార్ జోన్
• గోల్కొండ జోన్
• ఖైరతాబాద్ జోన్
• రాజేంద్రనగర్ జోన్
• సికింద్రాబాద్ జోన్
• శంషాబాద్ జోన్
సైబరాబాద్ కమిషనరేట్‌లో కొత్త మార్పులు:
• శేరిలింగంపల్లి జోన్ – మొయినాబాద్ నుంచి పటాన్ చెరు వరకు పరిధి
• కూకట్పల్లి జోన్ – మాదాపూర్ పరిథి ఇందులోకి
• కుత్బుల్లాపూర్ జోన్
రాచకొండ కమిషనరేట్ జోన్‌లు:
• ఎల్బీనగర్ జోన్
• మల్కాజిగిరి జోన్
• ఉప్పల్ జోన్
తాజా మార్పులతో పోలీసు జిల్లాలకు కూడా పునర్విభజన చేపట్టారు. యాదాద్రి జిల్లా ఎస్పీ పరిధిని మహేశ్వరం జోన్‌గా పునర్వ్యవస్థీకరించనున్నట్లు సమాచారం.
అంతేకాక, షాద్‌నగర్ మరియు చేవెళ్లను కలిపి “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” పేరుతో కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేయాలనే ప్రణాళిక కూడా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా ఉంది.