హన్మకొండ: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో స్థానిక కేయూ (KU) గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ గోల్డ్ కప్ ఈస్ట్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. గత 8 రోజులుగా ఉత్సాహంగా సాగిన ఈ టోర్నమెంట్‌లో పలు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
టోర్నమెంట్ చివరి రోజైన నేడు జరిగిన ఫైనల్ పోరులో హన్మకొండ జిల్లా జట్టు అద్భుత ప్రదర్శన చేసి విజేతగా నిలిచింది.
విజేతగా నిలిచిన హన్మకొండ జట్టుకు TCA రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి, ఉపాధ్యక్షుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి, మరియు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ప్రేమేందర్ రెడ్డి కలిసి ట్రోఫీని, బహుమతులను అందజేశారు.
క్రీడాకారుల ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని అసోసియేషన్ ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.