హన్మకొండ: రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల పెన్షనర్స్ డే & డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
రిటైర్డ్ పెన్షనర్ల సంక్షేమానికి కృషి చేస్తా…. ఎంపీ డా.కడియం కావ్య
హనుమకొండ లోని రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల పెన్షనర్స్ డే & డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారితో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సేవలను స్మరించుకొని వారి అనుభవాలు సమాజానికి ఎంతో మార్గదర్శకమని ఎంపీ పేర్కొన్నారు. అనంతరం డైరీని ఆవిష్కరించి, సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ,...పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
రిటైర్డ్ కళాశాల అధ్యాపకులు విద్యా రంగానికి అందించిన సేవలు అమూల్యమైనవని, వారి కృషి వల్లే అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.

పదవీ విరమణ అనంతరం కూడా అధ్యాపకులు తమ జ్ఞానం, అనుభవాలను సమాజహితానికి వినియోగించుకోవడం అభినందనీయమని అన్నారు. పెన్షనర్ల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు.
రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సంఘ భవన అభివృద్ధికి 10 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
అలాగే ప్రస్తుతం లీజుపై ఉన్న భవనాన్ని మరో 30 సంవత్సరాల పాటు లీజు పొడిగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
సీనియర్ సిటిజన్స్ అందరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

పదవీ విరమణ చేసిన అధ్యాపకులు తమ అనుభవాలు, జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా కొనసాగించాలన్నారు.
వచ్చే పెన్షనర్స్ డే కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావాలని కోరుతూ, ఇలాంటి కార్యక్రమాలు పరస్పర ఆత్మీయతను, ఐక్యతను పెంపొందిస్తాయని ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పులిసారంగాపాని, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, సెక్రటరీ మల్లారెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ సెక్రెటరీ రాజయ్య, జాయింట్ సెక్రెటరీలు కృష్ణమూర్తి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.