Homeకాజిపేట్గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోండి - ఇల్లందుల విజయ్

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోండి – ఇల్లందుల విజయ్

జనగాం జిల్లా: రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు.

స్టేషన్ ఘనపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇల్లందుల విజయ్ మాట్లాడుతూ, ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉత్తమ భోజనం, వసతి సౌకర్యాలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు.

TG Gurukul CET-2026: 5-9 తరగతి ప్రవేశాల నోటిఫికేషన్

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, జనవరి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.

విద్యార్థులు తమ మండల కేంద్రాల్లోని గురుకుల పాఠశాలలను లేదా సమీప ఆన్‌లైన్ కేంద్రాలను సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన సూచించారు.

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ఈ మంచి అవకాశాన్ని కల్పించిందని, అర్హులైన ప్రతి విద్యార్థి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments