హన్మకొండ: సిక్కు మతం పదవ గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ జయంతి సందర్బంగా ఈ రోజు కిషన్‌పురలోని గురు గోవింద్ సింగ్ మందిరంలో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై గురువారికి పూలమాలలతో నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురు గోవింద్ సింగ్ గారి త్యాగం, ధైర్యం, సమానత్వ భావం సమాజానికి చిరస్మరణీయ ప్రేరణఅని పేర్కొన్నారు.
అన్ని మతాల మధ్య సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతపరమైన పండుగలను సమానంగా గౌరవించే విధానాన్ని కొనసాగిస్తోందని తెలిపారు.
పూజల అనంతరం ఎమ్మెల్యే సిక్కు సమాజ పెద్దలను ప్రత్యేకంగా పలకరించి, జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
వేడుకలో కార్పొరేటర్ జక్కుల రవీందర్, మాజీ కార్పొరేటర్ నాగరాజు, డివిజన్ అధ్యక్షుడు శివాజీ, సిక్కు సంఘ ప్రతినిధులు హర్మీందర్ సింగ్, రస్పల్ సింగ్, హర్పాల్ సింగ్, తరంజిత్ సింగ్, జస్విందర్ సింగ్, అమన్దీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.