గోపాల్‌పూర్ క్రాస్ రోడ్ నుంచి గోపాల్‌పూర్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అడ్డంకులను తొలగించేందుకు హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సీతారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు, అక్రమ షెడ్డులను సిబ్బంది తొలగించారు.
ఈ మార్గంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గుర్తించిన పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.