Homeటూరిజంవరంగల్ చరిత్ర, కాకతీయుల సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం

వరంగల్ చరిత్ర, కాకతీయుల సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం

హనుమకొండ: జిల్లా పురావస్తు పరిశోధనశాలను సందర్శించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్ జిల్లా పురావస్తు పరిశోధన, ప్రదర్శనశాలను గురువారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు సందర్శించారు. అక్కడ ఉన్న శిలాశాసనాలు, విగ్రహాలు, శిల్పకళా సంపదను ఎంపీ పరిశీలించారు.

Dr Kadiyam Kavya at Archaeology Institute

ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ చరిత్ర, కాకతీయుల సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ప్రాంతపు వారసత్వాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఎంపీ అన్నారు. జిల్లా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సంరక్షణా పనుల గురించి ఎంపీ ఆరా తీశారు. పురాతన శిల్పకళ, కాకతీయ శిలాశాసనాలు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నాయని, వీటి సంరక్షణ కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని ఎంపీ డా.కడియం కావ్య స్పష్టం చేశారు. జిల్లా పురావస్తు అధికారులు ఎంపీకి వివిధ శిల్ప సంపద, ప్రాచీన నాణేలు, శాసనాల చారిత్రక నేపథ్యాన్ని వివరించారు.

Archeology Institute

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ బుజ్జి, మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

1 COMMENT

Comments are closed.

- Advertisment -spot_img

Most Popular

Recent Comments