హన్మకొండ: హక్కుల కాలరాసేందుకే కేంద్రం నూతన కార్మిక చట్టాలు
నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయబోమని తెలంగాణ సర్కారు తీర్మానించాలి
మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
ఫిబ్రవరి 12న కార్మికుల సమ్మెలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నాలి
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు
భారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయం బాలసముద్రం నందు ఆదివారం రోజున ఉద్యోగ కార్మిక హక్కుల సాధన కోసం నిర్వహించనున్న జిల్లా స్థాయి సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ…
శ్రామికులు దశాబ్దాల పోరాటాల ద్వారా, రక్తం చిందించి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం”ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” (వ్యాపారం సులభతరం చేయడం) అనే ముసుగులో, కార్మికుల జీవితాలను “ఈజ్ ఆఫ్ ఫైరింగ్” (సులభంగా తీసివేయడం) గా మార్చేస్తోంది.
వంద ఏళ్ల క్రితం పోరాడి 29 కార్మిక చట్టాలను సాధించడం జరిగిందని, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉద్యోగ, కార్మికులు ఎంత వ్యతిరేకించినా… కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని అన్నారు.
పాత కార్మిక చట్టాల రద్దు పూర్తిగా కార్మిక సంక్షేమ వ్యతిరేక చర్య అని విమర్శించారు
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా 4 నూతన చట్టాలను తీసుకొచ్చి కార్మిక, ఉద్యోగులకు కనీస హక్కులు లేకుండా కాలరాసే ప్రయత్నం చేస్తోంది
కేంద్ర ప్రభుత్వం, రైతులను, కార్మికులను నూతన చట్టాల పేరుతో మోసం చేయాలని ప్రయత్నిస్తోందని వివరించారు
కేంద్రం నూతనంగా తెచ్చిన 4 కార్మిక కోడ్‌ల కారణంగా కార్మికులు కనీసం వేతనం, సెలవులు, నిరసన చేసే హక్కులను సైతం కోల్పోతున్నారని తెలిపారు
నూతన కార్మిక చట్టాల కారణంగా చిన్న తరహా పరిశ్రమల్లో పని చేసే కార్మికులు వారి పూర్తి హక్కులను కోల్పోతారు.
8 గంటల పని విధానంపోయి నిర్బంధ 12 గంటల విధానం రాబోతోంది.
కార్మికులు వారి హక్కుల కోసం నిరసన, ధర్నాలు చేయకుండా, వారిని ఉద్యోగాల్లోంచి తొలగించడం, పరిహారం కోసం అడిగే హక్కు లేకుండా చేసే విధంగా నూతన కార్మిక చట్టాలను కేంద్రం ప్రభుత్వం రూపొందించింది.
ఉద్యోగ, కార్మిక, కర్షకులు హక్కులకు రక్షణ కల్పించాలి, కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెస్తే రైతులు ఉద్యమానికి తలవంచిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకోవడం జరిగిందని, ఆ రైతుల ఉద్యమ స్ఫూర్తితో కేంద్రంపై పోరాడుదాం
కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన ఫిబ్రవరి 12 దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొందాం
మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ…
కార్మికుల శ్రమ దోపిడీకి కేంద్రం వత్తాసు పలుకుతోంది
హక్కుల కాలరాసేందుకే కేంద్రం నూతన కార్మిక చట్టాలు తెచ్చింది
నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయబోమని తెలంగాణ సర్కారు తీర్మానించాలి
కార్మికుల హక్కులను కాలరాసేలే విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది
ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికులకు తీవ్రంగా అన్యాయం చేస్తోంది
వ్యవసాయ కార్మికులకు క్షమాపణ చెప్పి పార్లమెంటులో ఆమోదపరిచిన బిల్లులను ఏ విధంగా రద్దు చేసుకున్నారో అదే విధంగా ఈ కార్మిక చట్టాలను సైతం వెనక్కి తీసుకోవాలి
కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కార్మిక ఉద్యోగ సంక్షేమం కోసం పాటుపడే చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగానే రద్దు చేసింది
రాజ్యాంగ హక్కులను రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం… తన బాధ్యత నుంచి తప్పించుకొని సమాజంలో వ్యత్యాసాలను పెంచే విధంగా ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవారు మరింత కడు పేదవారిగా జీవించే విధానాన్ని ప్రోత్సహించడం చాలా బాధాకరం
కేంద్రం 29 చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లను కార్మికులపై బలవంతంగా రుద్దడాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 ఏండ్లలో పార్లమెంట్‌లో ఎటువంటి చర్చ లేకుండానే అనేక బిల్లులను, చట్టాలను ఏకపక్షంగా ఆమోదం తెలుపుతొంది. ఈ విధానం ప్రజాస్వామ్యానికి హానికరం
కేంద్రంలోని బీజేపీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిమూతపడుతున్నాయి.
భారత రాష్ట్ర సమితి పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ…
4 నూతన కార్మిక చట్టాల రద్దు కోసం భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఇప్పటికే రాష్ట్ర స్థాయి కార్మికుల కోసం సదస్సును నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలల్లో కార్మికుల పక్షాన సదస్సు నిర్వహించనున్నట్లు, దానిలో భాగంగా హనుమకొండ జిల్లా సదస్సును దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించామని అన్నారు.
కేంద్రానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉద్యోగుల, కార్మికల పొట్టకొడుతోందని విమర్శించారు.
రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్డ్ బెనిఫఫిట్స్ సైతం చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాల కారణంగా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్టకొట్టి వారు ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తోందని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల కారణంగా ఉద్యోగ, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని అన్ని సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమాలను రూపొందించనున్నట్లు తెలిపారు.
సదస్సు చేసిన 10 తీర్మానాలు…
- బేషరతుగా 4 నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలి, 29 పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి
- కార్మిక హక్కుల కోసం పోరాడిన పోస్టల్ డిపార్టమెంట్ జాతీయ నాయకుడు మహదేవయ్య ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
- రాష్ట్రంలోని లేబర్ కోర్టుల్లో ట్రిబ్యునల్స్‌ని పునరుద్ధరించాలి, పూర్తి స్థాయి న్యాయమూర్తులను నియమించాలి
- పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్‌లను వెంటనే విడుదల చేయాలి, కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించాలి
- తెలంగాణ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలు రూ.12 వేల భృతి, ఆటో కార్పొరేషన్, చనిపోయిన ఆటో కార్మికులకు ఎక్స్‌గ్రేషియా అందించాలి
- షాపింగ్ మాల్స్‌లో పని చేస్తున్న కార్మికులకు మౌలిక వసతులు, ఉద్యోగ రక్షణ కల్పించాలి.
- కేంద్ర, రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలి
- కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి.
- అన్ని కార్మిక సంఘాలు ఆర్థిక పరిపుష్టి కోసం పరస్పర సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి
- ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై పునరాలోచించాలి… ఫిల్డ్ అసిస్టెంట్స్ వేతనాలు పెంచాలి, ఉపాధి హామీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి, నూతన నియామకాలు చేపట్టాలి
కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నాయిని రవి, జిల్లా కో కన్వీనర్ మల్లేశం, పోస్టల్ ఉద్యోగ సంఘాల నాయకులు యాదవ రెడ్డి, వెంకటేశ్వర్లు, బీఎస్ఎన్ఎల్ కార్మిక సంఘం నాయకులు సంపత్ రావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు తేలు సారంగపాణి, కాటాపురపు రాజు , మంజుల యువరాజు, ఈసంపల్లి సంజీవ, జయరాం, బాబు, ధర్మరాజు,రఘు, స్వామి, భిక్షపతి, మహేందర్,రమేష్, మంజుల, రమ, రాజు, సమ్మయ్య, గిరి, శ్రీధర్, శివరాజ్, చంద్రమోహన్, పరుశురాములు, తిరుపతి, గోపాల్, రవి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సంఘటిత అసంఘటిత రంగా కార్మిక నాయకులు పాల్గొన్నారు