Homeవరంగల్డా. సత్యశారద | సమాసాలు ఎన్ని? వేమన పద్యాలంటే తెలుసా?

డా. సత్యశారద | సమాసాలు ఎన్ని? వేమన పద్యాలంటే తెలుసా?

వరంగల్ జిల్లా నర్సంపేటలోని గిరిజన బాలుర గురుకుల విద్యాలయ సందర్శనలో కలెక్టర్ డా. సత్యశారదకు ఒక ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది.

కలెక్టర్ విద్యార్థులను అడిగారు – “సమాసాలు ఎన్ని?” కానీ ఒక్క విద్యార్థి నోరు విప్పలేదు. ఆమె మళ్లీ అడిగారు, “వేమన పద్యాలు వచ్చా?” అయినా స్పందన లేదు. చివరగా “వేమన పద్యాలంటే తెలుసా?” అని అడిగినా, చివరకు ఎవరి నుండి సమాధానం రాలేదు.

ఈ సంఘటన విద్యార్థుల్లో తెలుగు సాహిత్యంపై అవగాహన, ఆసక్తి మరింత పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. వేమన వంటి కవుల సాహిత్యాన్ని తెలుసుకోవడం భాషా తెలుసుకునే మార్గమే కాక, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే దారికూడా.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments